Shruti Haasan: ఐరన్‌ లెగ్‌ అన్నారు…భయంతోనే ఇండస్ట్రీకి వచ్చా: శృతిహాసన్

హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన తొలిరోజుల్లో ఐరెన్ లెగ్ అని వేసిన ముద్ర ఇప్పటికి గుర్తుతుందన్నారు హీరోయిన్ శృతిహాసన్.

Published By: HashtagU Telugu Desk
Sruthi

Sruthi

హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన తొలిరోజుల్లో ఐరెన్ లెగ్ అని వేసిన ముద్ర ఇప్పటికి గుర్తుతుందన్నారు హీరోయిన్ శృతిహాసన్. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై స్పందించారు. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇండస్ట్రీకి భయంతో వచ్చా…హీరోయిన్ పాత్రలకు తాను సరిపోనని…వాయిస్ బాగోలేదని..సక్సెస్ కాలేవని …స్టార్ గా ఎదగలేనని కొందరు నా గురించి ఎన్నో మాట్లాడుకున్నారు. వీటన్నింటికి తోడుగా నేను తెలుగులో నటించిన రెండు సినిమాలు.. (అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ )అంతగా రాణించలేదు.

దీంతో ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో…గోల్డెన్ లెగ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఓవర్ నైట్ లోనే అంతా మారిపోయిందని చెప్పుకొచ్చారు శృతిహాసన్. మన గురించి ఇతరుల అభిప్రాయాలు వారికి నచ్చినట్లుగానే ఉంటాయి. కానీ మనం మనతో ఎప్పుడూ నిజాయితీగా మాట్లాడుకోవాలి. అప్పుడు సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం లభిస్తుందన్న తన నమ్మకాన్ని చెప్పింది. తన సక్సెస్ పుల్ సినిమా కెరీర్ లో తెలుగు ప్రేక్షకుల అభిమానం ఎన్నటికీ మరవను అని అన్నారు.

ఇక శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్, ప్రశాంత్ నీలో కాంబినేషన్ లో వస్తోన్న సాలార్ మూవీ, బాలయ్య బాబు గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తోన్న మరో మూవీలో నటిస్తోంది.

  Last Updated: 07 Mar 2022, 02:15 PM IST