Shruti Haasan: బ్లాక్ డ్రెస్ లో హీటెక్కిస్తున్న శృతి హాసన్.. ఏం అందం రా బాబు?

  • Written By:
  • Publish Date - February 23, 2024 / 09:00 AM IST

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శృతి హాసన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలు కూడా వరుసగా సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. కాగా ఈమె గత ఏడాది ఆరంభంలో బాల‌కృష్ఱ‌, చిరంజీవి సినిమాల‌తో ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డు మ‌ళ్లీ నాని హీరోగా వ‌చ్చిన‌ హ‌య్ నాన్న, ప్ర‌భాస్ స‌లార్ సినిమాల‌లోనూ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాల‌న్నీ ఒక‌దాన్ని మించి మ‌రోటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్స్‌గా నిలిచి శృతి కేరీర్‌ లోనే హ్యాట్రిక్ విజ‌యాలు అందించాయి.

దీంతో ఈమెకు అవకాశాలు వరుసగా క్యూ కడుతున్నాయి. క్రాక్ మూవీ నుంచి మొన్నటి సలార్ వరకు అన్ని చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు శ్రుతి హాసన్ ఫుల్ జోష్ మీదుంది. త్వరలోనే సలార్ 2 రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. కాగా శృతి హాసన్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యువతకు అభిమానులకు అందాల కనువిందు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా శృతిహాసన్ సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ ఫోటోలలో బ్లాక్ డ్రెస్ ధరించి మైండ్ బ్లాంక్ చేస్తోంది శ్రుతి. బ్లాక్ గ్లామర్ డ్రెస్ హై బూట్స్ ధరించి హాలీవుడ్ బ్యూటీ రేంజ్ లో కనిపిస్తుంది. నాజుకు నడుము అందాలతో కవ్విస్తూనే చూపులతో మత్తెక్కిస్తోంది. శృతిహాసన్ వయసుతోపాటు ఆమె అందం కూడా పెరుగుతోంది. అదే రేంజ్ లో అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. పోతే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అడివి శేష్ తో కలిసి డకోయిట్.. ఏ లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తుంది. అలాగే హాలీవుడ్ ఇండస్ట్రీలో మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తోంది శ్రుతిహాసన్.ఇవే కాకుండా కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో హీరోయిన్ ఓరియెంటెడ్ కథలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలా మొత్తంగా ఈ ముద్దుగుమ్మ ఇందులో అరడజన్ సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.