Shruti Haasan Love : వీడు ఎన్నో ‘NO ‘ అంటూ కామెంట్స్ చేస్తున్నారు – శృతి హాసన్ ఎమోషనల్

Shruti Haasan Love : గతంలో యూకే నటుడు మైకేల్ కోర్సాలేతో, ఆపై విజువల్ ఆర్టిస్ట్ శాంతనుతో శృతి ప్రేమలో ఉండగా, ఇప్పుడు రెండూ విఫలమై సింగిల్‌గా ఉన్నట్టు వెల్లడించింది

Published By: HashtagU Telugu Desk
Sruthi Love

Sruthi Love

లెజెండరీ నటుడు కమల్ హాసన్ కూతురిగా సినీ రంగంలో అడుగుపెట్టిన శృతి హాసన్, తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. కెరీర్ ఆరంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, తర్వాత టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. సినిమాల కంటే ఎక్కువగా తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచే సందర్భాలు ఎక్కువయ్యాయి. గతంలో యూకే నటుడు మైకేల్ కోర్సాలేతో, ఆపై విజువల్ ఆర్టిస్ట్ శాంతనుతో శృతి ప్రేమలో ఉండగా, ఇప్పుడు రెండూ విఫలమై సింగిల్‌గా ఉన్నట్టు వెల్లడించింది.

Gluten: గ్లూటెన్ శరీరానికి ఎందుకు హానికరం? దీనివల్ల ఏ వ్యాధులు సంభవించవచ్చు!

తన బ్రేకప్ ల గురించి ప్రజలు చేస్తున్న వ్యాఖ్యలు తనను బాధించాయని శృతి హాసన్ భావోద్వేగంగా తెలిపింది. “ప్రతి ఒక్కరి జీవితంలో ఫెయిల్యూర్ ప్రేమ కథలు ఉంటాయి. నేను కూడా కొన్ని బ్రేకప్‌లు అనుభవించాను. కానీ నేను కోరుకున్న నిజమైన ప్రేమను పొందడంలో విఫలమయ్యాను. ప్రజలు మాత్రం నన్ను ఒక సంఖ్యలా చూస్తున్నారు. ఇది నన్నెంతో బాధిస్తోంది. నేను కూడా ఒక సాధారణ మనిషినే కదా” అని శృతి ఆవేదన వ్యక్తం చేసింది.

  Last Updated: 27 Apr 2025, 02:54 PM IST