తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా రాణించిన శ్రియా (Shriya Saran ) తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా త్రిష, శ్రియాలు తమదైన యాక్టింగ్ , గ్లామర్ తో దశాబ్దానికి పైగా టాలీవుడ్‌లో హవా చూపించారు. తర్వాత కొత్త తరం హీరోయిన్ల ఎంట్రీ తో వీరి క్రేజ్ కొంత తగ్గిపోయింది. త్రిష “96” సినిమా ద్వారా మళ్లీ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చినా, శ్రియాకు మాత్రం అలాంటి అవకాశాలు అందలేదు. “ఆర్ఆర్ఆర్” వంటి చిత్రంలో నటించినా పెద్దగా ప్రభావం చూపే పాత్ర అందుకోలేకపోయింది.
Ticket Prices Hike : అక్కడ రేట్లు పెరిగాయి మరి ఇక్కడ..?
కరోనా సమయంలో శ్రియా తన కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ రష్యాలోనే తన కూతురు రాధకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ముంబైలో ఫ్యామిలీతో హాయిగా కాలం గడుపుతోంది. తెలుగులో మళ్లీ శ్రియాకు అవకాశాలు వస్తాయా? ఆమె టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇస్తుందా? అన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త తరం హీరోయిన్లే ఎక్కువగా ఛాన్స్‌లు అందుకుంటున్నారు. సినిమాల ఛాన్సులు లేనప్పటికీ శ్రీయ సోషల్ మీడియా లో నిత్యం వైరల్ గా చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తన కూతురు రాధ చేసే చేష్టలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల పుష్ప రాజ్ మ్యానరిజాన్ని రాధ చేస్తూ నటించిన వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేయగా, అది మంచి స్పందన పొందింది.
తాజాగా శ్రియా తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (Shriya Saran New Year Celebrations ) వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె చేసిన డ్యాన్స్ స్టెప్పులు, ప్రత్యేకంగా ఆ నడుము తిప్పిన తీరు నెటిజన్లను కట్టిపడేశాయి. శ్రియాలో ఎముకలు కాదు, స్ప్రింగులు ఉన్నాయేమో అనిపించేంత అందంగా డ్యాన్స్ చేసింది. శ్రియాకు వయసు పెరిగినా ఆమె గ్లామర్, ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి ఎంజాయ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.