Bigg Boss House Mates: నాలుగో వారం కూడా సేమ్ సీన్ రిపీట్.. ఈసారి కూడా టార్గెట్ ఇనయానే?

తాజాగా బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఇక ఎప్పటిలాగే ఈ వారం

Published By: HashtagU Telugu Desk
Bigg Boss Season 6

Bigg Boss Season 6

తాజాగా బిగ్ బాస్ నాలుగో వారం నామినేషన్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా అందరూ కలిసి ఇనయ ని టార్గెట్ చేశారు. కాకా గత వారం శ్రీహన్ ని ఇనయ వాడు అన్నందుకు నానా రచ్చ చేశాడు శ్రీహాన్. ఆ తర్వాత ఇనయ ని శ్రీహాన్ పిట్ట అంటూ హీరన చేయగా ఆమె గట్టిగా నిలదీయడంతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇదే విషయంలో శ్రీహన్,గీతు, రేవంత్ లు ఇనయ ని టార్గెట్ చేస్తూ హేళన చేసే మాట్లాడారు. ఈ విషయం పట్ల నాగార్జున గీతకి అలాగే శ్రీ హాన్ కీ గట్టిగానే బుద్ధి చెప్పాడు.

అనంతరం రేవంత్ కి కూడా గట్టిగానే క్లాసు పీకారు నాగార్జున. తాజాగా జరిగే నామినేషన్ లో కూడా ఇదే విషయంపై ఇనయ ని టార్గెట్ చేశారు. బిగ్బాస్ హౌస్లోని కంటెస్టెంట్లకు ఒక టాస్క్ ని ఇస్తూ ఇద్దరు చొప్పున నామినేట్ చేస్తూ వాళ్ళ తలపై టమోటాలు కొట్టాలి అని ఆదేశించాడు. శ్రీహాన్ ఇనయని నామినేట్ చేస్తూ బాగా అతి చేశాడు. ఆ తరువాత మళ్ళీ ఇనయ నామినేట్ చేస్తున్న సమయంలో కావాలనే ఒక్క నిమిషం ఆగు అంటూ ఆవలించి అతి చేష్టలు చేస్తూ కనిపించాడు శ్రీహాన్.

ఆ తరువాత ఏజ్ విషయంలో కూడా శ్రీహాన్,ఇనయల మధ్య డిస్కషన్ చర్చలు నడిచాయి. అప్పుడు ఇనయ కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆన్సర్ చెప్పు అనగా నచ్చితే చెప్తా నచ్చకపోతే చెప్పను అని తల గోక్కుంటూ యాటిట్యూడ్ చూపించాడు శ్రీహన్. నా ఏజ్ ఎక్కువ అని అన్నావ్ ఎలా అన్నావ్ నేను మనిషిని పెద్దగా కనిపిస్తే నా ఏజ్ అంత ఎక్కువగా కనిపిస్తుందా? ఫ్రెండ్ షిప్ చేస్తే ప్రాణం ఇస్తా అని ఇనయ అంటుంటే హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే అని కౌంటర్ వేశాడు శ్రీహాన్. ఇక గీతు, ఆరోహి, పింకీ మిగిలిన బ్యాచ్ అందరు కలిసి ఇనయని నామినేట్ చేస్తూ కనిపించారు. అయితే హౌస్ లో కంటెస్టెంట్లు అందరూ ఆమెను ఒంటరి చేసి టార్గెట్ చేయడంతో ఆమె అంతకంతకూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారుతోంది.

  Last Updated: 26 Sep 2022, 10:59 PM IST