Site icon HashtagU Telugu

Devara : ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు పై శ్రేయస్ మీడియా క్లారిటీ

Shreyas Media

Shreyas Media

Shreya’s Media Clarity on Devara Pre-Release : : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ (Devara) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Devara Pre Release Event) రద్దు కావడం తో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ ఈవెంట్ ను చూడాలని , ఎన్టీఆర్ మాటలను వినాలని , సినిమా విశేషాలను తెలుసుకోవాలని తెలుగు రాష్ట్రాల నుండే కాదు ఇతర రాష్ట్రాలనుండి కూడా పెద్ద ఎత్తున అభిమానులు నిన్న హైదరాబాద్ కు చేరుకున్నారు. ఉదయం నుండి హైదరాబాద్ నోవాటెల్ ముందు పడిగాపులు కావడం మొదలుపెట్టారు. వందలు కాదు వేల సంఖ్యలో అభిమానులు చేరుకోవడం తో ఈవెంట్ కొనసాగుతుందో లేదో అని అంత భావించారు.

ఈ ఈవెంట్ ను భారీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ..అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో ఈవెంట్ రద్దు చేసారు నిర్వాకులు. ఇచ్చిన పాస్ ల సంఖ్య కంటే ఎక్కువమంది రావడంతో పోలీసులు వారిని కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. అభిమానులు భారీగా పోటెత్తగా.. వేదిక ఏ మూలకు సరిపోలేదు. ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ఫ్యాన్స్ ఎగబడటంతో పలువురు కిందపడిపోగా.. ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు ఫర్నీచర్ ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్ధితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో దాదాపు 100 మంది వరకు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఎక్స్‌ట్రా పాసులు అమ్మడం వల్ల భారీ సంఖ్యలో అభిమానులు వచ్చినట్లు వారంతా వాపోయారు. ఎందుకు ఎక్కువ అమ్మడం..ఎందుకు రద్దు చేయడం అని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారం ఫై శ్రేయాస్ మీడియా క్లారిటీ ఇచ్చింది.

‘పోలీసులు 4వేల మంది హాజరయ్యేందుకు పర్మిషన్ ఇచ్చారు. కానీ 30-35 వేల మంది రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఫ్యాన్స్ సేఫ్టీ కోసమే ఈవెంట్ రద్దు చేశాం. మమ్మల్ని క్షమించండి. అవుట్ డోర్ ఈవెంట్ కోసం ప్రయత్నించాం. కానీ గణేశ్ నిమజ్జనం, వెదర్ అలర్ట్స్ వల్ల సాధ్యం కాలేదు. పరిమితికి మించి పాసులు జారీ చేశామన్న ఆరోపణలు అవాస్తవం’ అని పేర్కొంది.

ఈవెంట్ రద్దు కావడం తో ఎన్టీఆర్ ఓ వీడియో రిలీజ్ చేసారు. ‘ఇది చాలా బాధాకరం. నాకు చాలా బాధగా ఉంది. అవకాశం ఉన్నప్పుడు ఫ్యాన్స్ తో సమయం గడపాలని, దేవర సినిమా గురించి వివరించాలని అనుకున్నా. కానీ భద్రతా కారణాలతో ఈవెంట్ రద్దైంది. నేనూ బాధపడుతున్నా. మీకంటే నా బాధ పెద్దది. ఇలా జరిగినందుకు ఎవరినీ నిందించవద్దు. మీ ప్రేమకు రుణపడి ఉంటా’ ఈ నెల 27 థియేటర్స్ లో కలుద్దాం అంటూ తెలిపారు.

మరోపక్క ‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దవడంపై హీరోయిన్ జాన్వీ కపూర్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. తెలుగులో ఎంతో చక్కగా మాట్లాడడం విశేషం. ‘అందరికీ నమస్కారం. నామీద ఇంత ప్రేమ చూపిస్తోన్న తెలుగు ప్రేక్షకులకు, జాను పాప అని పిలుస్తోన్న ఎన్టీఆర్ అభిమానులకు ధన్యవాదాలు. నన్ను సొంత మనిషిలా ఫీలవుతున్నారు. మా అమ్మకి, నాకు మీరెంతో ముఖ్యం. మీరు గర్వపడేలా కష్టపడి పనిచేస్తా. దేవర నా ఫస్ట్ తెలుగు సినిమా’ అని వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈరోజు ఉదయం యూఎస్ కు వెళ్లారు. అక్కడ దేవర ప్రమోషన్ లలో పాల్గొననున్నారు.

Read Also : Mahesh Babu : సీఎం రేవంత్ రెడ్డి కి చెక్ అందించిన మహేష్ బాబు