ఈమధ్య బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర స్టార్స్ కూడా చేయలేనంతగా కలెక్షన్స్ సాధిస్తున్న సినిమా స్త్రీ 2. ఈ ఆడ దెయ్యం బాలీవుడ్ లో సంచలనాలు సృష్టిస్తుంది. అమర్ కౌశిక్ డైరెక్ట్ చేసిన స్త్రీ 2 (Stree 2) సినిమాలో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు (Raj Kumar Rao) లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా రిలీజ్ ముందు నుంచి టీజర్, ట్రైలర్ తోనే బజ్ పెంచుకోగా ప్రీమియర్స్ తోనే 10 కోట్ల దాకా వసూఒళ్లు సాధించింది.
ఇక లాస్ట్ ఫ్రై డే రిలీజ్ అయిన స్త్రీ 2 ఫస్ట్ డే నే 55 కోట్ల వసూళ్లతో అదరగొట్టేసింది. రెండో రోజు 35, మూడో రోజు 45 కోట్ల దాకా వసూళ్లు తీసుకు రాగా ఫైనల్ గా ఇప్పుడు 150 కోట్ల పైన వసూళ్లతో దూసుకెళ్తుంది. చూస్తుంటే సినిమా ఇవాళ రేపట్లో 200 కోట్లు దాటి అదరగొట్టేలా ఉంది.
సినిమా ఫుల్ రన్ లో నెవర్ బిఫోర్ అనిపించేలా ఉంది. స్త్రీ 2 తో శ్రద్ధ కపూర్ (Shraddha Kapoor) సెన్సేషనల్ హిట్ అందుకుంది. సినిమా తెరకెక్కించే టైం లో మేకర్ ఆడియన్స్ నుంచి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ఊహించారో లేదో కానీ సినిమా మాత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. స్త్రీ 2 గురించి బాలీవుడ్ లో స్పెషల్ డిస్కషన్స్ చేస్తున్నాయి.
మొన్నటిదాకా కెరీర్ లో చాలా వెనకపడ్డ శ్రద్ధ కపూర్ స్త్రీ 2 హిట్ తో మంచి సక్సెస్ అందుకుంది. కెరీర్ లో అమ్మడు డిఫరెంట్ సినిమాలతో అలరించాలని ఫిక్స్ అయ్యింది. అందుకే స్త్రీ 2 కథ రాగానే ఆమె ఎలాంటి నెక్స్ట్ థాట్ లేకుండా ఓకే చేసింది. సినిమాలో శ్రద్ధ యాక్టింగ్ కి బీ టౌన్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.