Bollywood Failures: పరాజయాల బాటలో ‘బాలీవుడ్’

వరుస ఫెయిల్యూర్స్ తో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతోంది.

Published By: HashtagU Telugu Desk
Bollywood

Bollywood

వరుస ఫెయిల్యూర్స్ తో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతోంది. భారీ అంచనాలతో వస్తున్న పెద్ద సినిమాకి షోలు రద్దు కావడం నిజంగా షాకింగ్ విషయం. రణబీర్ కపూర్ నటించిన ‘షంషేరా’ చిత్రంపై ఎలాంటి భారీ అంచనాలున్నాయి. అయితే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా దారుణంగా ఉంది. టికెట్స్ బుక్ కాకపోవడంతో చాలా చోట్ల నాలుగో రోజు షోలు రద్దయ్యాయి. అక్షరాలా సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో వాణి కపూర్, సంజయ్ దత్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

మొదటి రోజు రూ. 10.24 కోట్ల కలెక్షన్లతో ప్రారంభమైన ఈ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్ రూ. 50- రూ. 60 కోట్ల మధ్య ఉండవచ్చని ట్రేడ్ నిపుణుల అభిప్రాయం. సోమవారం నాడు కలెక్షన్లలో భారీగా 70% తగ్గుదలతో దేశవ్యాప్తంగా రూ.4 కోట్లు రాబట్టింది. సినిమా పంపిణీ, ప్రచారానికి అయిన ఖర్చు కూడా రాబడుతుందా? లాంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. మొత్తానికి బాలీవుడ్ మరో చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక అక్షయ్ కుమార్ నటించిన ‘సామ్రాట్ ప్రుధ్వీరాజ్’ కూడా ఆశించిన మేరలో కలెక్షన్లు సాధించలేక భారీ నిరాశను మిగిల్చింది.  మరికొన్ని సినిమాలు కూడా ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. ఇక బాలీవుడ్ ఆశలన్నీ పాన్ ఇండియా ‘బ్రహ్మస్త్ర’ పైనే పెట్టుకుంది.

  Last Updated: 26 Jul 2022, 01:13 PM IST