Site icon HashtagU Telugu

Kaps Cafe Attack : కపిల్ శర్మ కేప్పై మరోసారి కాల్పులు

Kapil Kaps Cafe Attack

Kapil Kaps Cafe Attack

ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ కెనడాలో ప్రారంభించిన “కప్స్ కేఫ్” మళ్లీ దాడికి గురైంది. ఇప్పటికే ఈ కేఫ్‌పై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు బెదిరింపులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, రాత్రి వేళ ఓ కారు లో వచ్చిన దుండగులు కేఫ్ వెలుపల కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కాల్పుల తర్వాత దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడి వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌నే ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

తాజా ఘటన తర్వాత గోల్డీ దిల్లాన్, కుల్దీప్ సిద్ధు అనే ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఈ దాడి తామే జరిపామని ప్రకటించారు. వారు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులుగా తమను పరిచయం చేసుకున్నారు. ఈ ప్రకటనతో పోలీసు వ్యవస్థ మరింత అప్రమత్తమైంది. కపిల్ శర్మ కేఫ్ భద్రతను పెంచుతూ, సీసీటీవీ ఫుటేజీలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఈ గ్యాంగ్ సభ్యులు కపిల్‌ను బెదిరిస్తూ, “సేఫ్టీ కోసం ప్రొటెక్షన్ మనీ ఇవ్వాలి” అంటూ హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. కపిల్ శర్మ ఇప్పటికే ఈ బెదిరింపులపై కెనడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సంఘటనతో బాలీవుడ్ వర్గాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ప్రముఖులు, కమెడియన్లు, నటులు సామాజిక మాధ్యమాల్లో కపిల్ శర్మకు మద్దతు తెలుపుతున్నారు. “కళాకారులపై ఇలాంటి బెదిరింపులు నిందనీయమైనవి” అంటూ పలువురు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న మాఫియా గ్యాంగ్‌లు ఇప్పుడు వినోద రంగాన్నీ లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కపిల్ శర్మ ప్రస్తుతం భద్రతా కారణాల రీత్యా తన పబ్లిక్ ఈవెంట్లను తగ్గించినట్లు సమాచారం. పోలీసులు గ్యాంగ్ మూలాలను గుర్తించేందుకు కెనడా, భారత్ లలోని ఇంటర్‌పోల్ అధికారులతో సమన్వయం చేస్తూ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Exit mobile version