సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో గుంటూరు కారం (GunturKaaram) మూవీ తెరకెక్కుతుంది. గతంలో వీరిద్దరి కలయికలో అతడు , ఖలేజా మూవీస్ వచ్చి అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో లో మూవీ రాబోతుండడం తో అంచనాలు తారాస్థాయికి చేరాయి. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం సజావుగా సాగడం లేదు. నిత్యం ఏదొక కారణంతో బ్రేక్ పడుతుంది. మొన్నటికి మొన్న హీరోయిన్ విషయంలో బ్రేక్ పడింది. ముందుగా పూజా హగ్దే ను మెయిన్ హీరోయిన్ గా , సెకండ్ హీరోయిన్ గా ధమాకా ఫేమ్ శ్రీలీల ను అనుకున్నారు. కానీ మళ్లీ ఏమైందో ఏమో పూజా హగ్దే ను తీసేసి..ఆమె ప్లేస్ లో శ్రీలీల (Sreeleela) ను మెయిన్ హీరోయిన్ గా పెట్టి , సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ని తీసుకున్నారు.
ఇలా హీరోయిన్ల మార్పుతో కాస్త బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు అంత ఒకే అనుకుంటున్న టైములో మహేష్ లండన్ కు వెళ్తున్నారనే వార్త అభిమానులను కలవరపాటుకు గురి చేస్తుంది. మరి మహేష్ లేకుండా షూటింగ్ జరుపుతారా..? లేక బ్రేక్ ఇస్తారా అని అంత మాట్లాడుకుంటున్నారు. ఫిలిం వర్గాలు మాత్రం మహేష్ బాబు లేని సీన్లను త్రివిక్రమ్ షూట్ చేయబోతున్నాడని అంటున్నారు. మొత్తం మీద సంక్రాంతి బరిలో తీసుకొస్తామని చెపుతున్న మేకర్స్ ..ఆ టైం కు సినిమా ను తీసుకొస్తారో లేదో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్ ..అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయనున్నాడు.
Read Also : Krithi Shetty Photoshoot : వర్షంలో తడిచిన అందాలతో కృతి శెట్టి..