Site icon HashtagU Telugu

Shocking Surprise in Devara : ఎన్టీఆర్ చెప్పిన సర్ప్రైజ్ ఫై అంచనాలు..

Devara Interview

Devara Interview

Shocking Surprise in Devara : ‘దేవర..’దేవర ‘..’దేవర’ ఇప్పుడు ఎక్కడ చూసిన..ఎక్కడ విన్న ఈ పేరే వినిపిస్తుంది. ఎన్టీఆర్ – కొరటాల శివ (NTR-Koratala Shiva) కలయికలో పాన్ ఇండియా గా తెరకెక్కిన ఈ మూవీ (Devara) తాలూకా ఫస్ట్ పార్ట్ ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమాలోని పలు సాంగ్స్ , ట్రైలర్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచగా..ఇక ఇప్పుడు ప్రమోషన్ కార్య క్రమంలో ఎన్టీఆర్ చెపుతున్న సినిమా విశేషాలు గూసుబంప్స్ తెప్పిస్తున్నాయి.

తాజాగా ఎన్టీఆర్, సైఫ్, జాన్వీ, కొరటాల శివ (NTR & Devara Team , Janhvi Kapoor , Saif Ali Khan , Koratala)ను దర్శకుడు సందీప్ వంగా చేసిన ఇంటర్వ్యూ(Sandeep Reddy Vanga Interview)ను విడుదల చేసింది. మూవీ టీమ్ పలు ఆసక్తికర విషయాలను అందులో పంచుకోగా ఆ క్లిప్స్ వైరల్ అవుతున్నాయి. షూటింగ్ నుంచి సినిమాలోని పాత్రల వరకు పలు వివరాలను ఎన్టీఆర్, కొరటాల వివరించారు. ‘దేవర’ సినిమాలో సముద్రంలో జరిగే సన్నివేశాల కోసం ఒక సెపరేట్ పూల్ ను రూపొందించినట్లు ఎన్టీఆర్ తెలిపారు. వాటర్లో దాదాపు 35 రోజులపాటు షూట్ చేశామన్నారు. దీని వల్ల అవసరమైన దానికంటే కొంత ఎక్కువగా ఖర్చయిందని, ఈ సీక్వెన్స్ సినిమాకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. సినిమాలో ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంటుందని, దాన్ని ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తారో చూసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు విన్నవారంతా ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అని మాట్లాడుకుంటున్నారు.

Read Also : Pimples And Hair Loss: మొటిమ‌లు, జుట్టు రాల‌డం స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నారా..?