ప్రైమ్ వీడియో అభిమానులకు (Prime Video fans) ఇది నిజంగా షాకింగ్ న్యూస్. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియో తాజాగా చేసిన ప్రకటనలో వచ్చే నెల 17వ తేదీ (జూన్ 17) నుంచి ప్రైమ్ వీడియోలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేటప్పుడు యాడ్స్ (Ads) ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు యాడ్ ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ (Ad-free Experience) ఇచ్చిన ఈ సేవ ఇప్పుడు మారనుంది. తద్వారా వినియోగదారులకు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
Indias Best Friends: ‘ఆపరేషన్ సిందూర్’ వేళ భారత్‌కు బెస్ట్ ఫ్రెండ్స్.. ‘‘ఆ నలుగురు’’ !
వినియోగదారులు యాడ్స్ లేకుండా అంతరాయం లేకుండా అనుభూతిని కోరుకుంటే, వారు అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉంది. యాడ్ ఫ్రీ కంటెంట్ కోసం నెలకు రూ.129 లేదా ఏడాదికి రూ.699 చెల్లించాలని అమెజాన్ పేర్కొంది. ఈ నిర్ణయం ప్రకారం.. ప్రైమ్ వీడియో యాడ్ ఫ్రీ వెర్షన్ ఇప్పుడు విడిగా ఒక సబ్‌స్క్రిప్షన్‌లా మారిపోనుంది. ఈ మార్పుతో పాటు సంస్థ తన ఆదాయాన్ని మరింతగా పెంచాలనే వ్యూహాన్ని అమలు చేస్తోంది.
ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తో పోలిస్తే ప్రైమ్ వీడియోలో ఇప్పటికే వినియోగదారులు ఏడాదికి రూ.1499 చెల్లిస్తూ మెంబర్షిప్ పొందుతున్నారు. ఇప్పుడు అదనంగా యాడ్ ఫ్రీ ప్లాన్ కోసం చెల్లించాల్సి రావడం చాలా మంది వినియోగదారులకు అసంతృప్తిని కలిగించే అంశం అవుతుంది. ఈ మార్పులు వలన వినియోగదారుల స్పందన ఎలా ఉంటుందో, ఇతర ఓటీటీ సంస్థలు దీన్ని ఎలా అనుసరిస్తాయో చూడాల్సిన అవసరం ఉంది.