Site icon HashtagU Telugu

Shobitha Shivanna : చిత్రసీమలో విషాదం..యువనటి ఆత్మహత్య..!!

Shobitha Shivanna

Shobitha Shivanna

చిత్రసీమలో వరుస విషాదాలు ఆగడంలేదు. కొంతమంది అనారోగ్య సమస్యలతో తనువు చలిస్తుంటే..మరికొంతమంది పలు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు. ఇంకొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఆయా కుటుంబాల్లో , అభిమానుల్లో విషాదాలు నింపుతున్నారు. రీసెంట్ గా రైటర్ కులశేఖర్ అనారోగ్య సమస్య తో కన్నుమూశారు. మొన్నటికి మొన్న సమంత (Samantha )తండ్రి జోసెఫ్ ప్రభు(Joseph Prabhu)గుండెపోటుతో నిద్రలోనే మరణించగా.. నిన్నటికి నిన్న బిగ్ బాస్ (Bigg Boss) మాజీ కంటెస్టెంట్ రతికా రోజ్ (Rathika rose) తండ్రి రాములు (Ramulu)కూడా మరణించారు. అయితే ఈయన మరణానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ మూడు సంఘటనలను మరువకముందే. తాజాగా బుల్లితెర యువ నటి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

కన్నడ పాపులర్ సీరియల్ నటి శోభిత శివన్న (30) (Shobitha Shivanna) హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ కి వస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈమె ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే విషయం మాత్రం ఇంకా తెలియ రాలేదు. కర్ణాటకలోని సక్లేశ్ పూర్ కి చెందిన శోభిత శివన్న ‘బ్రహ్మగంటు’ వంటి సీరియల్లో నటించి ఆకట్టుకుంది. అయితే 2023లో వివాహం చేసుకున్న ఈమె అనంతరం ఇండస్ట్రీకి దూరమై హైదరాబాదులో స్థిరపడింది. కానీ ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కన్నడలో ఏరేండ్లతూ, ఏటీఎం, జాక్ పాట్, అపార్ట్మెంట్ టు మర్డర్, వందనా వంటి కన్నడ సినిమాల లో నటించింది. ఇక బ్రహ్మగంటు , నినిదలే వంటి కన్నడ సీరియల్స్ లో నటించింది. పలు ప్రోగ్రామ్స్ కి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది. ఇక బ్రహ్మగంటు సీరియల్ లో విలన్ గా నటించిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాధారణంగా కుటుంబ కథా సీరియల్స్‌లో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సహజసిద్ధమైన అభినయంతో తన పాత్రలకు ప్రాణం పోస్తూ ఉంటుంది. ఆమె పాత్రలు ఎక్కువగా సీరియల్ కథలలో ప్రధాన పాత్రలుగా ఉంటాయి, ముఖ్యంగా ఎమోషనల్, సెంటిమెంట్ సీన్లలో ఆమె ప్రతిభ మెరుస్తుంది.

ఇకపోతే మే 22 ,2023న అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంది. మరి ఇంతలోనే ఏమైందో ఏమో కానీ ఆమె ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.ప్రస్తుతం ఈమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు కానీ శోభిత డెడ్ బాడీని పోస్ట్మార్టంకి పంపించినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని బెంగళూరుకు తీసుకెళ్లే అవకాశాలున్నట్లు సమాచారం.

Read Also : Naked Art Exhibition : నగ్నంగా వస్తేనే ఎంట్రీ.. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ వెరీ స్పెషల్