Site icon HashtagU Telugu

Peddi : ‘పెద్ది’లో శివరాజ్ కుమార్ లుక్ రిలీజ్

Shivaraj Peddi

Shivaraj Peddi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi ) ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌తో మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. రామ్ చరణ్ (RamCharan) ఈ గ్లింప్స్‌లో తనదైన శైలిలో బ్యాట్ ఝులిపిస్తూ బాక్సాఫీస్‌పై ఎలా ప్రభావం చూపించబోతున్నాడో చెప్పకనే చెప్పాడు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అందర్నీలో అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) పుట్టినరోజు సందర్భంగా, ఆయన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆయన రఫ్ లుక్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. మేకర్స్ ఆయన పాత్రకు ‘గౌర్నాయుడు’ అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ లుక్ ద్వారా ఆయన పాత్రకు ఎంత విలువ ఉందో అర్థమవుతోంది.

Lover : ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని..ఆత్మ హత్య చేసుకున్న యువకుడు

ప్రస్తుతం హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. రెండు రోజులు షూట్ ను శివరాజ్ పై పూర్తి చేసారు. ఆ రెండు రోజుల షూటింగ్ ఎంతో మధురంగా అనిపించిందని శివరాజ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. “ఈ సినిమాలో తొలిసారిగా తెలుగు డైలాగ్స్ చెప్పాను. డైరెక్టర్ బుచ్చిబాబు చాలా మంచి వ్యక్తి. రామ్ చరణ్ చాలా వినయంగా వ్యవహరిస్తారు. నా పాత్ర ఈ సినిమాలో చాలా ప్రత్యేకం” అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో ఆయన రామ్ చరణ్‌కి కోచ్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు , మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివరాజ్ కుమార్‌తో పాటు జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తుండగా లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండడం విశేషం. ఈ భారీ పాన్ ఇండియా చిత్రం 2026 మార్చి 27న విడుదల కాబోతోంది.