Site icon HashtagU Telugu

Viral : శివన్న సింప్లిసిటీకి ఫిదా

Shivarajkumar New

Shivarajkumar New

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) ఫ్యాన్స్‌కు మరోసారి తన సింప్లిసిటీ ని చూపించారు. తాజాగా ఇంటి దగ్గర ఓ చిన్నారి సైకిల్‌తో ఆడుకుంటుండగా, ఆ సైకిల్‌ను తీసుకొని శివన్న కొద్దిసేపు సైకిలింగ్ చేయడం, ఆ పిల్లాడితో సరదాగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు “ఇది రియల్ స్టార్ అంటే” అని కామెంట్లు చేస్తున్నారు. శివన్నలా పెద్ద స్టార్‌లు తమ అభిమానుల దగ్గర ఇంకా ఇలా సాధారణంగా ఉంటే ఎంత బాగుంటుందో అని పలువురు అభిప్రాయపడ్డారు.

Bhagavad Git : భగవద్గీతకు యునెస్కో గుర్తింపు

ఇటీవలే క్యాన్సర్‌ పై విజయం సాధించిన శివరాజ్ కుమార్ ఆరోగ్యాన్ని పూర్తిగా నిలుపుకుని, మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారారు. ఈ ధైర్యం, శ్రమ ఆయన జీవితంపై పాజిటివ్‌గా ప్రభావం చూపాయి. అభిమానుల ఆశీస్సులతో శివన్న తిరిగి తన గెటప్‌లోకి వచ్చారు. ప్రతి పాత్రలో జీవం పోసే నటుడిగా పేరున్న ఆయన, ఇప్పుడు మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు.
తెలుగు లో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పెద్ది అనే చిత్రంలో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుంటూ, డబ్బింగ్ కూడా స్వయంగా చెప్పుతున్నారు. ఇది తెలుసుకున్న తెలుగు ప్రేక్షకులు ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు. సూపర్ స్టార్ అయినప్పటికీ భాషపై శ్రద్ధ, పని మీద ప్రేమ.. ఇవన్నీ శివన్నను అభిమానుల గుండెల్లో నిలిపే విశేషాలు.

Exit mobile version