Site icon HashtagU Telugu

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నాకు వార్నింగ్ ఇచ్చారు.. నటుడు శివాజీ రాజా కామెంట్స్ వైరల్!

Pawan Kalyan

Pawan Kalyan

తెలుగు ప్రేక్షకులకు నటుడు శివాజీ రాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా,సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు శివాజీ రాజా. అయితే ఒకప్పుడు వరుసగా సినిమాలలో నటించిన ఆయన ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీతో శివాజీకి మంచి స్నేహబంధం ఉంది. దాదాపు 30 ఏళ్ళ పాటు నాగబాబు, శివాజీ ప్రాణ స్నేహితులుగా మెలిగారు.

పవన్ కళ్యాణ్ తో కూడా శివాజీకి మంచి స్నేహం ఉండేది. కానీ ఒక సంఘటన శివాజీ, నాగబాబు స్నేహం మధ్య గ్యాప్ తీసుకు వచ్చింది. ఆ సంఘటన పవన్ కళ్యాణ్ కి సంబంధించింది. టాలీవుడ్ లో శ్రీ రెడ్డి విషయం తెలియని వారు ఎవరు ఉండరు. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఈ నటి టాలీవుడ్ లో పెద్ద గొడవ చేసింది. ఆ గొడవలోనే మెగా బ్రదర్స్ తల్లిపై కూడా కామెంట్స్ చేసారు. దానికి పవన్ సీరియస్ అయ్యి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై ఫైర్ అయ్యారు. ఆ సమయంలో పవన్ మా అసోసియేషన్ ఆఫీస్ కి వెళ్లి పెద్ద గొడవనే చేసారు. కాగా ఆ సమయంలో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా శివాజీ రాజా ఉన్నారట.

అంత పెద్ద గొడవ జరుగుతున్నా శివాజీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పవన్ ఫైర్ అయ్యారట. ఈ క్రమంలోనే పవన్ కోపంతో మాట్లాడుతూ.. నెక్స్ట్ టైం నువ్వు ప్రెసిడెంట్‌గా ఎలా ఉంటావో నేను చూస్తాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు, చెప్పినట్లు నెక్స్ట్ టర్మ్ మా ఎలక్షన్స్ లో నాగబాబు.. శివాజీని ఓడించేలా పనిచేసారు. చివరికి అనుకున్న విధంగా ఓడించారు కూడా. అయితే పవన్ విషయంలో శివాజీ ఎటువంటి తప్పు చేయలేదని, శ్రీరెడ్డి విషయంలో తాను రెస్పాండ్ అయ్యినట్లు పేర్కొన్నారు. శ్రీరెడ్డి పై డీజీపీ కి కంప్లైంట్ ఇచ్చామని, కానీ ఆ విషయం పవన్ కి తెలియదని, అందువల్లే ఆయన అంత సీరియస్ అయ్యారని చెప్పుకొచ్చారు. శివాజీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version