BiggBoss 7 : అప్పుడే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్తా అంటూ శివాజీ అరుపులు

బిగ్ బాస్ ఇంట్లో నాలుగో రోజు టెన్షన్ వాతావరణం మొదలైంది. శివాజీ కాఫీ పంపించలేదని సీరియస్ అయిపోయాడు

Published By: HashtagU Telugu Desk
Shivaji Angry on BigBoss for not giving coffee

Shivaji Angry on BigBoss for not giving coffee

నార్త్ లో సూపర్ సక్సెస్ అయినా రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss)..సౌత్ లోను రాణిస్తుంది. సీజన్ సీజన్ కు ఆడియన్స్ ను పెంచుకుంటూ..TRP రేటింగ్ పెంచుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం Bigg Boss 7 వ సీజన్ నాల్గు రోజుల క్రితం అట్టహాసంగా ప్రారంభమైంది. గత సీజన్ ప్రేక్షకులను ఏమాత్రం అలరింపచేయలేకపోయింది. పెద్దగా పరిచయం లేని వ్యక్తులను సెలక్ట్ చేయడం..హౌస్ లో వారు పెద్దగా ఆకట్టుకోలేకపోవడం..టాస్క్ లు కూడా ఏమాత్రం బాగుండకపోవడం..ఇలా చాల మైనస్ లు గత సీజన్ లో కనిపించాయి. దీంతో ఈ సీజన్ ను పక్క ప్లాన్ తో తీసుకొచ్చారు. బిగ్ బాస్ 7.. ఇది ఉల్టా పల్టా సీజన్. ఇక్కడ అంతా డిఫరెంట్ గా ఉంటుంది.. ఇంతవరకు మీరు చూసిన ఆట వేరు.. ఈ సీజన్ లో మీరు చూడబోయే ఆట వేరు అంటూ ఆరంభంలోనే యమ కిక్కిచ్చారు కింగ్.

ఈ షోలో మొత్తం 14 మంది కంటిస్టెంట్స్ (bigg boss 7 contestants)హౌస్ లోకి తీసుకొచ్చారు బిగ్ బాస్. ప్రియాంక జైన్ తొలి కంటిస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఆ తర్వాత సింగర్ దామిని, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, ఆట సందీప్, షకీలా, శోభా శెట్టి, టేస్టీ తేజ, రితిక రోజ్, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి పట్టమని మూడు రోజులు గడవలేదు..అప్పుడే కొట్లాటలు, చమత్కారాలు.. అన్నీ షురూ అయ్యాయి. ఇక బిగ్ బాస్ ఇంట్లో నాలుగో రోజు టెన్షన్ వాతావరణం మొదలైంది. శివాజీ కాఫీ పంపించలేదని సీరియస్ అయిపోయాడు. తలుపులు తీస్తే ఇంట్లో నుంచి వెళ్లిపోతానని పెద్ద పెద్దగా అరుస్తూ గొడవ చేసాడు. శివాజీ ప్రవర్తనకి అందరూ షాక్ అయ్యారు. తనకి సర్ది చెప్పడానికి చూశారు కానీ ఎవరి మాట వినిపించుకోలేదు. కోపంతో శివాజీ ఇంట్లో ఉన్న వస్తువులు విసిరేస్తూ ఇంకొక గంట చూస్తాను బొక్క కూడా భయపడను ఎవరికీ అని సీరియస్ అయిపోయాడు.

Read Also : Land Dwellers: కాళేశ్వ‌ర్యం ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు చెక్ ల పంపిణీ

బిగ్ బాస్ (Bigg Boss House) ఇంట్లోకి బీపీ చెక్ చేసే మిషన్ పంపిస్తాడు. శివాజీ (Shivaji) బీపీ చెక్ అప్ డేట్ ఇవ్వమని గౌతమ్ కృష్ణకి చెప్పాడు. కానీ శివాజీ మాత్రం “ఏం చూస్తావ్ నువ్వు పెట్టు అక్కడ.. నువ్వు చూసుకో నీకే ఎక్కువైందని” చిరాకుపడ్డాడు. తనని రెచ్చగొడితే అన్ని పగలగొట్టేసి వెళ్లిపోతానని చిందులేశాడు. తలుపు తీయ్యి ఒక్క నిమిషం ఉంటే అప్పుడు అడగమని అరుస్తాడు. ఆ తర్వాత స్టెతస్కోప్ పంపించి రతికని ప్రతి ఒక్కరి దగ్గరకి వెళ్ళి వాళ్ళ గుండె ఏం చెప్తుందో చెప్పమని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. అప్పుడు కూడా శివాజీ ఫైర్ అయిపోతాడు. స్టెతస్కోప్ శివాజీ లాగేసుకుని నేను ఇక్కడ బాధపడుతుంటే ఆయనకి కామెడీగా ఉందా అంటూ కోప్పడతాడు. అందరినీ చూడు కానీ శివాజీని వదిలేసి పిచ్చోడిని చేద్దామని చెప్తున్నాడా అని రతిక మీద సీరియస్ అయ్యాడు. “ఓ సామి తలుపు తీయి” నేను పోతా అంటూ శివాజీ రచ్చ రచ్చ చేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో ఎపిసోడ్ ఫై ఆసక్తి పెంచుతుంది. హౌస్ లో ఇంకేం జరిగిందో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

  Last Updated: 07 Sep 2023, 05:25 PM IST