హీరోగా ఎంట్రీ ఇచ్చినా సెకండ్ హీరోగా పలు సినిమాలు చేశాడు శివ బాలాజీ(Shiva Balaji). ఆర్య(Arya) సినిమాతో మంచి పేరు తెచ్చుకొని వరుస ఛాన్సులు తెచ్చుకున్నాడు. అప్పట్నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా బిజీ అయ్యాడు శివబాలాజీ. ఇక బిగ్ బాస్(BiggBoss) లో పాల్గొన్న తర్వాత మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు.
ఇక శివబాలాజీ నటి మధుమితని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మధుమతి కూడా హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. తాజాగా శివబాలాజీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకుంటూ మధుమితతో ఉన్న లవ్ స్టోరీని రివీల్ చేశాడు.
శివబాలాజీ ఇంటర్వ్యూలో తమ ప్రేమ గురించి మాట్లాడుతూ.. మధు నా కంటే చాలా ముందే ఇండస్ట్రీకి వచ్చింది. తను వచ్చిన చాలా రోజుల తర్వాత నేను వచ్చాను. మేమిద్దరం కలిసి తమిళ సినిమా ఇంగ్లీష్ కరన్ లో కలిసి నటించాము. ఆ సినిమా పూర్తయ్యేటప్పటికే మేము ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాము. రోజూ ఫోన్స్ మాట్లాడుకునే వాళ్ళం. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా ఇద్దరం బయటపడలేదు. సినిమా అయిపోయాక నేనే ఒకరోజు డైరెక్ట్ పెళ్లి చేసుకుందామా అని అడిగాను. తను ఓకే చెప్పాక వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మ జాతకాలు కలవలేదు అని పెళ్లి వద్దంది. వాళ్ళింట్లో వాళ్ళని ఒప్పించడానికి దాదాపు సంవత్సరం పట్టింది. పెళ్లి తర్వాత ఇప్పుడు మధుతో, పిల్లలతో మరింత హ్యాపీగా ఉన్నాను అని తెలిపాడు. ఇక వీరి పెళ్లి 2009 మార్చ్ 1న హైదరాబాద్ లో జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు అబ్బాయిలు.
Also Read : Navdeep : నన్ను గే అన్నారు.. నవదీప్ సంచలన వ్యాఖ్యలు..