Salaar 2 : ప్రభాస్ ‘సలార్ 2’లోకి మరో మలయాళ స్టార్ నటుడు ఎంట్రీ.. ఏ పాత్ర కోసం..?

ప్రభాస్ 'సలార్ 2'లోకి మరో మలయాళ స్టార్ నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇంతకీ ఎవరు ఆ నటుడు..? ఏ పాత్ర కోసం..?

Published By: HashtagU Telugu Desk
Shine Tom Chacko Play Important Role In Prabhas Salaar 2

Shine Tom Chacko Play Important Role In Prabhas Salaar 2

Salaar 2 : ప్రభాస్ హీరోగా, మలయాళ నటుడు ప్రథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రోపొందుతున్న సంగతి అందరికి తెలిసిందే. మొదటి బాగా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది. దీంతో ఆడియన్స్ అంతా సెకండ్ పార్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ నెల చివరిలో లేదా, వచ్చే నెల మొదటి వారంలో ఈ మూవీ షూటింగ్ ని పట్టాలు ఎక్కించనున్నారు టాక్ వినిపిస్తుంది. కాగా ఈ సెకండ్ పార్ట్ లో మొదటి భాగంలో కనిపించిన పాత్రలతో పాటు మరికొన్ని కొత్త పాత్రలు కూడా కనిపించనున్నాయట. ఈక్రమంలోనే రెండో భాగంలో ఓ ముఖ్య పాత్ర పరిచయం కాబోతుందట. ఇక ఆ పాత్ర కోసం మరో మలయాళ నటుడిని.. ప్రశాంత్ నీల్ రంగంలోకి దించుతున్నారట.

ఇటీవల కాలంలో తెలుగు ఆడియన్స్ ని అశేషంగా ఆకట్టుకుంటున్న మలయాళ నటుడు ‘షైన్ టామ్ చాకో’. దసరా, రంగబలి సినిమాల్లో తన పాత్రలతో తెలుగు ఆడియన్స్ ని టామ్ చాకో బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ నటుడు ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఇప్పుడు ‘సలార్ 2’లో కూడా కనిపించబోతున్నారట. మరి ఆ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.

కాగా ఈ మూవీ షూటింగ్ సెట్స్ లోకి ప్రభాస్.. జులై నుంచి జాయిన్ కానున్నారని సమాచారం. మొదటి భాగం చిత్రీకరణ సమయంలోనే.. ప్రభాస్ సెకండ్ పార్టుకి సంబంధించిన కొన్ని షాట్స్ ని పూర్తి చేశారట. మరికొన్ని సీన్స్ తో ప్రభాస్ కి సంబంధించిన చిత్రీకరణ చాలా త్వరగానే పూర్తి కానుందట. అక్టోబర్ నాటికి మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిపోతుందట.

  Last Updated: 16 May 2024, 04:54 PM IST