Shilpa Shetty: కన్నడలోకి శిల్పాశెట్టి రీ ఎంట్రీ.. వింటేజ్ లుక్ అదుర్స్

శిల్పాశెట్టి 17 సంవత్సరాల తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమకు తిరిగి వస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Shilpa Shetty

Shilpa Shetty

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టి 17 సంవత్సరాల తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమకు తిరిగి వస్తున్నారు. యాక్షన్ హీరో ధృవ్ సర్జా నటిస్తున్న ‘కెడి’ చిత్రంలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ప్రేమ్ తన సోషల్ మీడియా లో పోస్టర్‌ను షేర్ చేశాడు. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని రాశారు. ఈ పవిత్రమైన రోజున, ఒక పవర్‌హౌస్ యుద్ధంలోకి ప్రవేశిస్తుంది! KD యుద్దభూమిలో శక్తివంతమైన శిల్పాశెట్టికి స్వాగతం! అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

వింటేజ్ లుక్ పోస్టర్ కర్ణాటకలోని శిల్పా అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. శిల్పా ఇంతకు ముందు వి.రవిచంద్రన్‌తో కలిసి 1998లో సూపర్‌హిట్ కన్నడ చిత్రం ప్రీతసోద్ లో పని చేసింది. ఆమె ఒండగోనా బా (2003)లో కూడా నటించింది. 2005లో ఆమె ఉపేంద్ర సరసన ఆటో శంకర్ చిత్రంలో నటించింది. బాలీవుడ్ తో పాటు కన్నడలో కూడా శిల్పాశెట్టికి మంచి ఫాలోయింగ్ ఉంది.

  Last Updated: 23 Mar 2023, 11:18 AM IST