Site icon HashtagU Telugu

Sharwanand & Raashi: ఈ జోడీకి హిట్ పడేనా!

Sharwa

Sharwa

యువహీరో శర్వానంద్ హిట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. సరైన కథ పడాలే కానీ.. శర్వ నటన ఓ నెక్ట్స్ లెవల్ అని చెప్పక తప్పదు. అలాంటి నటుడు సక్సెస్ రేటులో వెనుకపడిపోయాడు. శర్వాకు సంబంధించిన ఓ సినిమా పూర్తి కావోస్తుండగా.. మరో సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. పీపుల్స్ మీడియా బ్యానర్‌పై కృష్ణ చైతన్యతో సినిమా చేయనున్నాడు. కథ డిమాండ్ మేరకు బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నాడు శర్వానంద్. అయితే రాశీఖన్నాతో తొలిసారి జోడీ కట్టబోతున్నాడు.

శర్వా కోరుకున్న ఫిజిక్ సొంతంకాగానే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. గతంలో కృష్ణ చైతన్య నితిన్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. కానీ అది సాధ్యపడలేదు. ఇప్పుడు శర్వానంద్‌తో అలాంటి సినిమానే చేస్తున్నాడు. అయితే రాశి ఖన్నా కెరీర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. గోపిచంద్ తో నటిస్తున్న రాశీఖన్నా “పక్కా కమర్షియల్” త్వరలో విడుదల కానుంది. త్వరలో సెట్స్ కు వెళ్లబోయే కొత్త సినిమా అయినా శర్వా-రాశీలకు హిట్ అందిస్తుందా? అనేది వేచిచూడాల్సిందే!

Exit mobile version