Site icon HashtagU Telugu

Sharwanand : హైదరాబాద్‌లో శర్వానంద్ రిసెప్షన్.. KCRని స్వయంగా ఆహ్వానించిన శర్వా..

Sharwanand Reception in Hyderabad Sharwa invites KCR Persoonally

Sharwanand Reception in Hyderabad Sharwa invites KCR Persoonally

టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) ఇటీవల జూన్ 3న వివాహం చేసుకున్నాడు. జైపూర్(Jaipur) లీలా ప్యాలెస్ లో రక్షిత(Rakshita) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ని ఘనంగా వివాహం చేసుకున్నాడు. రక్షిత టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు, హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు. శర్వా వివాహానికి రామ్ చరణ్, సిద్దార్థ్, అదితి రావు హైదరి.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే వివాహం జైపూర్ లో పెట్టడంతో కేవలం అతి సన్నిహితులను మాత్రమే పిలిచాడు శర్వా.

ఇక రేపు జూన్ 9న హైదరాబాద్ లో శర్వానంద్ రిసెప్షన్(Reception) జరగనుంది. ఈ రిసెప్షన్ భారీగా నిర్వహించనున్నారు. సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది హీరోలు, నటీనటులు, టెక్నీషియన్స్, ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ రిసెప్షన్ కి హాజరు కానున్నారు. ఇక శర్వానంద్ నేడు స్వయంగా వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి KCRని తన రిసెప్షన్ కి ఆహ్వానించారు. శర్వా, KCR ని కలిసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Also Read : Mega Celebrations: ఇట్స్ అఫీషియల్.. రేపే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం!