Site icon HashtagU Telugu

Manamey Teaser : శర్వానంద్ ‘మనమే’ టీజర్ చూసారా.. చిరంజీవి సినిమా స్ఫూర్తి..!

Sharwanand Krithi Shetty Manamey Movie Teaser Released

Sharwanand Krithi Shetty Manamey Movie Teaser Released

Manamey Teaser : శర్వానంద్ తన 35వ సినిమాని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘మనమే’ అనే క్లాసీ టైటిల్ ని పెట్టారు. కాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ అండ్ సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. తాజాగా టీజర్ ని తీసుకు వచ్చారు. టీజర్ చూస్తుంటే చిరంజీవి సినిమా కథ స్ఫూర్తితో వస్తుందా అన్నట్లు కనిపిస్తుంది.

లైఫ్ ని చాలా సరదాగా, తన స్వార్థం కోసం గడిపేసే హీరో. లైఫ్ ని ఒక భాద్యతగా, ఇచ్చిన మాట కోసం కట్టుబడే వ్యక్తిగా బ్రతికే హీరోయిన్. వీరిద్దరి జీవితంలోకి ఒక చిన్న పిల్లాడు రావడం, ఆ తరువాత ఏం జరిగింది అనేది కథ అని తెలుస్తుంది. సినిమా కథ అంత చిన్న పిల్లాడు చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. టీజర్ చూస్తుంటే.. చిరంజీవి పసివాడి ప్రాణం స్ఫూర్తితో మూవీని న్యూ ఏజ్ స్టోరీతో తెరకెక్కిస్తున్నారా అనే సందేహం కలుగుతుంది. మరి ఆ టీజర్ వైపు మీరు ఓ లుక్ వేసేయండి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా శర్వానంద్ నుంచి మూవీ వచ్చి రెండేళ్లు అయ్యిపోయింది. ఈక్రమంలోనే ఈ సినిమా సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. హేశం అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారు.