Sharwanand 35 : శర్వా సినిమాకు కొత్త టైటిల్ అదేనా..?

Sharwanand 35 యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం శ్రీరాం ఆదిత్య డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Sharwanand 35 Movie Title As Maname

Sharwanand 35 Movie Title As Maname

Sharwanand 35 యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం శ్రీరాం ఆదిత్య డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఫారిన్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు ముందు టైటిల్ గా BoB అని పెట్టాలని అనుకున్నారు. సినిమా కథ ఒక బాబు చుట్టే తిరుగుతుందట. అందుకే సినిమాకు BoB అనే టైటిల్ అనుకున్నారు.

కానీ అది ఇంగ్లీష్ లో పెడితే అంత క్యాచీగా ఉండదని ఇప్పుడు ఆ సినిమాకు మనమే అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. అక్కినేని ఫ్యామిలీ మనం సినిమాకు దగ్గరగా మనమే అనే టైటిల్ అయితే ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. ఈ సినిమాలో డైరెక్టర్ శ్రీరాం ఆదిత్య నాలుగేళ్ల తనయుడు ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది.

సినిమా మొత్తం హీరో శర్వానంద్ ఇంకా ఆ బాబు చుట్టే తిరుగుతుందట. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా చాలా గ్యాప్ తర్వాత కృతికి వచ్చిన లక్కీ ఛాన్స్ ఇందని చెప్పొచ్చు. మరి ఈ మనమే సినిమా ప్రేక్షకులకు ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.

  Last Updated: 28 Feb 2024, 10:11 AM IST