Site icon HashtagU Telugu

Sharukh khan : దేవర డైరెక్టర్ పై షారుఖ్ ఖాన్ కన్ను.. భారీ ప్లాన్..!

Shahrukh Khan

Sharukh

Sharukh khan కొన్నాళ్లుగా ఏమాత్రం ఫాం లో లేని బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లాస్ట్ ఇయర్ వరుసగా 3 సినిమాలతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. పఠాన్, జవాన్, డుంకీ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. షారుఖ్ ఫాం లోకి వస్తే బాక్సాఫీస్ ఎలా కళకళలాడుతుందో ఫ్యాన్స్ ని చూపించాడు.

ప్రస్తుతం షారుఖ్ తన నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ తో బిజీగా ఉన్నాడు. అట్లీతో జవాన్ సినిమా చేసిన షారుఖ్ మళ్లీ సౌత్ డైరెక్టర్స్ తోనే సినిమా చేయాలనే ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది.

ఈసారి తెలుగు డైరెక్టర్ తో షారుఖ్ కలిసి సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. షారుఖ్ ఖాన్ తెలుగు దర్శకుడు కొరటాల శివ తో సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట. రైటర్ నుంచి డైరెక్టర్ గా మారిన కొరటాల శివ మిర్చి నుంచి అచార్య వరకు డైరెక్టర్ గా తన సత్తా చాటాడు. చివరిగా వచ్చిన ఆచార్య ఫ్లాప్ అయినా కూడా మళ్లీ దేవరతో తన స్టామినా ప్రూవ్ చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఎన్.టి.ఆర్ తో ఆల్రెడీ జనతా గ్యారేజ్ సినిమా చేసిన కొరటాల శివ మళ్లీ ఆ హిట్ కాంబో రిపీట్ చేస్తూ ఈసారి దేవరగా పాన్ ఇండియా రేంజ్ లో సంచలనానికి సిద్ధమయ్యారు. దేవర తర్వాత విజయ్ దేవరకొండతో కొరటాల శివ సినిమా ఉంటుందని టాక్. ఈలోగా షారుఖ్ ఖాన్ కూడా కొరటాల శివతో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. షారుఖ్ తో కొరటాల శివ కాంబో సెట్ అయితే మాత్రం సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు.

Also Read : Vishwambhara : ‘విశ్వంభర’ లో మరో నటి..?