Site icon HashtagU Telugu

Sharukh Khan : ఇడ్లీ వడ రాం చరణ్.. షారుఖ్ పై విరుచుకు పడుతున్న మెగా ఫ్యాన్స్..!

Sharukh Khan Disrespect On Ram Charan Ananth Ambani Pre Wedding Event

Sharukh Khan Disrespect On Ram Charan Ananth Ambani Pre Wedding Event

Sharukh Khan అనంత్ అంబాని, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు టాలీవుడ్ తరపున మెగా పవర్ స్టార్ రాం చరణ్ దంపతులకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. అంబాని ఇంట పెళ్లికి వెళ్లిన ఒకే ఒక్క తెలుగు హీరో రాం చరణ్. అక్కడ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో రాం చరణ్ బాలీవుడ్ హీరోలతో కలిసి నాటు నాటు డ్యాన్స్ వేసిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకలోనే షారుఖ్ ఖాన్ రాం చరణ్ ని అవమానించినట్టుగా మాట్లాడిన విషయం బయట పడింది.

ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ తన సోషల్ మీడియాలో రాం చరణ్ పై షారుఖ్ డిస్ రెస్పెక్ట్ గా మాట్లాడిన తీరు గురించి వెల్లడించారు. ఇడ్లీ వడ రాం చరణ్ కహా హే తు అంటే ఇడ్లీ వడ రాం చరణ్ నువ్వెక్కడ ఉన్నావ్ అంటూ షారుఖ్ అన్నాడని. ఆ మాట విని తాను అక్కడ నుంచి బయటకు వెళ్లానని జెబ హాసన్ రాసుకొచ్చింది.

సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలు ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తున్న మన హీరోల గురించి బాలీవుడ్ హీరోలు ఎక్కడో ఒకచోట అవహేళనగా మాట్లాడటం జరుగుతూనే ఉంది. షారుఖ్ ఆ మాట సరదాకే అన్నా ఆయన ఏ ఇంటెన్షన్ తో అలా అన్నారన్నది అర్ధం చేసుకోవచ్చు. షారుఖ్ ఖాన్ చరణ్ పై ప్రవర్తించిన ఈ తీరుకి బదులుగా మెగా ఫ్యాన్స్ అంతా కూడా షారుఖ్ మీద ఫైర్ అవుతున్నారు.

సౌత్ సినిమాలు.. వాటి విజయాలను భరించలేని బాలీవుడ్ హీరోలు ఇలా వీలు దొరికినప్పుడల్లా సౌత్ హీరోల గురించి అవమాన కరంగా మాట్లాడతారు. షారుఖ్ కామెంట్స్ పై సౌత్ సినీ అభిమానులు.. తెలుగు ఆడియన్స్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Kiara Advani : కియరా టాపు లేపే రెమ్యునరేషన్..!