Site icon HashtagU Telugu

Shruti Haasan : శంతను వల్ల నేను అలా మారిపోయాను..

Shruti Haasan

Shruti Haasan

డూడుల్‌ ఆర్టిస్ట్‌ శంతనుతో తాను రిలేషన్‌లో ఉన్న విషయాన్ని శ్రుతీహాసన్‌ (Shruti Haasan) ఎప్పుడూ సీక్రెట్‌గా ఉంచలేదు. సోషల్‌ మీడియాలో అతనితో క్లోజ్‌గా ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తూ, కామెంట్లు పెడుతుంటారీ బ్యూటీ. తాజాగా శంతను వల్ల తనలో వచ్చిన మార్పు గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘నేను, శంతను బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ఇద్దరం కలిసి ఉంటాం. ఇద్దరం కలిసి కామెంట్లు చదువుతుంటాం. ఎందుకంటే ఆ కామెంట్స్‌ కామెడీగా ఉంటాయి.

ఇక తన వల్ల నేను ప్రశాంతంగా మారిపోయాను. అలాగే దయగల వ్యక్తిగా వరాను. శంతను చాలా ప్రశాంతంగా, దయగా ఉంటాడు. అందుకే తనంటే నాకు ఇష్టం. ఈ రెండు లక్షణాలను నేను అలవాటు చేసుకున్నాను’’ అని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు శ్రుతీహాసన్‌ (Shruti Haasan). ఇక సినివల విషయానికి వస్తే.. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో ఈ సంక్రాంతికి థియేటర్లలో కనిపించనున్నారు శ్రుతీహాసన్‌. ప్రస్తుతం ప్రభాస్‌ సరసన ‘సలార్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

Also Read:  Rakul Preet Singh: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌