Indian : భారతీయుడు మూవీని వెంకటేష్‌తో చేయాలని అనుకున్నారట.. మీకు తెలుసా..?

భారతీయుడు మూవీని వెంకటేష్‌తో చేయాలని అనుకున్నారట. వెంకటేష్ ని కొడుకు పాత్రలో మరో హీరోని తండ్రి పాత్రలో..

  • Written By:
  • Publish Date - July 9, 2024 / 11:53 AM IST

Indian : శంకర్, కమల్ హాసన్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు సినిమా 1995లో రిలీజయ్యి భారీ విజయాన్ని అందుకుంది. లంచం అనే సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ ని తీసుకు వస్తున్నారు. భారతీయుడు 2 ఈ వారం రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా దర్శకుడు శంకర్ భారతీయుడు కథ రాసుకున్నప్పుడు కమల్ పాత్ర కోసం మరో హీరోని అనుకున్నారట. కానీ ఫైనల్ గా ఆ రోల్ కమల్ ని వరించింది.

దర్శకుడు శంకర్ భారతీయుడు కథ రాస్తున్న సమయంలో రజినీకాంత్ ని దృష్టిలో పెట్టుకొని రాశారట. అయితే రజినికి ఉన్న కొన్ని కమిట్మెంట్స్ వల్ల భారతీయుడుకి ఓకే చెప్పలేకపోయారు. దీంతో ఆ కథని కమల్ హాసన్ దగ్గరికి తీసుకు వెళ్లారు శంకర్. ఇక కథ విన్న కమల్ హాసన్ వెంటనే ఓకే చెప్పేసారు. అయితే కమల్ హాసన్ దగ్గరికి వెళ్లేముందు శంకర్ ఒక ‘ప్లాన్ బి’ని కూడా రెడీ చేసుకొని వెళ్లారట. ఒకవేళ కమల్ నో చెబితే.. ఆ కథని తీసుకోని వెంకటేష్ దగ్గరికి వెళ్దాం అనుకున్నారట. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంది. భారతీయుడులో కమల్ హాసన్ తండ్రి కొడుకులుగా నటించిన సంగతి తెలిసిందే.

ఒకవేళ భారతీయుడు సినిమాని వెంకటేష్ తో చేయాల్సి వస్తే.. తండ్రి పాత్రని హీరో రాజశేఖర్ తో చేయించి, వెంకటేష్ ని కొడుకు పాత్రలో చూపించాలని అనుకున్నారట. ఇలా ఒక ప్లాన్ బిని సిద్ధం చేసుకొని కమల్ దగ్గరికి వెళ్లారు. అయితే కమల్ హాసన్ ఓకే చెప్పేయడంతో శంకర్ కి ప్లాన్ బి అవసరం లేకుండా పోయింది. ఇక సినిమా రిలీజైన తరువాత భారతీయుడుగా కమల్ హాసనే బెస్ట్ ఛాయస్ అనిపించింది అందరికి. మరి ఇన్నాళ్ల తరువాత రాబోతున్న సీక్వెల్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Also read : Shankar Comments on Ram Charan Game Changer Release : గేమ్ చేంజర్ పై శంకర్ కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ లో టెన్షన్..!

Follow us