భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో డైరెక్టర్ శంకర్ ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన బాయ్స్, అపరిచితుడు, రోబో లాంటి సినిమాలు సంచనాలు నమోదు చేశాయి. అందుకే శంకర్ అనగానే భారీ బడ్జెట్ మూవీస్ కళ్ల ముందు కదలాడుతాయి. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. S. శంకర్, బాలీవుడ్ ఫేం రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుద్దిద్దుకోబోతోంది. బాహుబలి తర్వాత అతిపెద్ద పాన్-ఇండియా సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ భారీ ప్రాజెక్ట్ తమిళ ఇతిహాసం ఆధారంగా డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
“శంకర్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహించడానికి సూపర్‌స్టార్‌లలో ఒకరైన సూపర్‌స్టార్ రణవీర్ సింగ్ వైపు మొగ్గు చూపడంతో మరింత సంచలనం రేపుతోంది. మరోసారి విజువల్స్ ఎఫెక్ట్స్, భారీ హంగులు, పెద్ద పెద్ద సెట్స్, ఊహించని థ్రిల్స్ ను భారతీయ ప్రేక్షకులు ఆస్వాదించబోతున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో బహుళ భారతీయ భాషలలో 3-భాగాల ఇతిహాసంగా రూపొందించబడుతుంది.
“కథ చాలా పెద్దది. అన్ని అంశాలను ఒకే చిత్రంలో కవర్ చేయలేము. శంకర్ మూడు భాగాల సినిమాకి తగిన స్క్రీన్‌ప్లేను రూపొందించాడు. అతను 2023 మధ్య నుండి మొదటి భాగం చిత్రీకరణను ప్రారంభించాలని భావిస్తున్నాడు. శంకర్, రణవీర్‌ల కాంబినేషన్ ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద చిత్రం అవుతుంది” అని అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా భారతీయ సినిమాలో ఒక మైలురాయిని సృష్టిస్తుంది అని అంటున్నారు క్రిటిక్స్. ఇప్పటికే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్-1 మూవీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.