Indian 3 : ‘భారతీయుడు’తో గతంలో బ్లాక్ బస్టర్ ని అందుకున్న శంకర్ మరియు కమల్ హాసన్.. ఇప్పుడు దానికి సీక్వెల్ ని తీసుకు వచ్చారు. అయితే ఈ సీక్వెల్ ని రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. మొదటి భాగం భారతీయుడు 2 నేడు రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం థియేటర్స్ వద్ద మిక్సెడ్ టాక్ వినిపిస్తుంది. కాగా ఈ సినిమా ఎండ్ క్రెడిట్స్ లో భారతీయుడు 3 ట్రైలర్ ని శంకర్ జత చేసారు. ఇక ఆ ట్రైలర్ చూస్తుంటే.. అసలు కథ ఆ సినిమాలోనే ఉందని తెలుస్తుంది.
భారతీయుడు 1, భారతీయుడు 2 చిత్రాలను ప్రస్తుత టైం పీరియడ్ తో తెరకెక్కించి, మద్యమద్యలో బ్రిటిష్ రూలింగ్ లోని స్వాతంత్ర సన్నివేశాలను చూపించారు. అయితే మూడో భాగంలో మాత్రం.. బ్రిటిష్ రూలింగ్ కి సంబంధించిన పోరాట సన్నివేశాలనే ఎక్కువగా చూపించనున్నారని తెలుస్తుంది. రెండో భాగంలో కనిపించని కాజల్ అగర్వాల్ కూడా మూడో భాగంలో ముఖ్య పాత్ర చేస్తున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. సేనాపతితో కలిసి కాజల్ అగర్వాల్ కూడా స్వాతంత్ర పోరాటంలో ఫైట్ చేస్తూ కనిపిస్తున్నారు.
బ్రిటిషర్స్ పై సేనాపతి చేసే పోరాటాన్ని పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో ఆడియన్స్ కి చూపిస్తూ, ప్రస్తుతం కాలానికి లింక్ చేయబోతున్నారని తెలుస్తుంది. రెండో భాగం పై ప్రేక్షకుల రివ్యూ ఎలా ఉన్నా గాని, మూడో భాగం ట్రైలర్ పై మాత్రం మంచి స్పందనే వస్తుంది. ఆల్రెడీ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ మూడో భాగాన్ని 2025లో రిలీజ్ చేయబోతున్నట్లు ట్రైలర్ లో తెలియజేసారు.
#indian3 trailer pic.twitter.com/8rPgFYTtlp
— kittu (@krthkdotk) July 12, 2024