Shankar Comments: రాజమౌళి’పై ‘శంకర్’ ప్రసంశల జల్లు

ధర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'RRR' సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలై, కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Shankar

Shankar

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘RRR’ సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలై, కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం, తొలి ఆటతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. జూనియర్ ఎన్టీఆర్, చరణ్ పాత్రలను రాజమౌళి డిజైన్ చేసిన తీరును సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన స్టార్ డైరెక్టర్లు, పలువురు హీరలతో పాటు, ప్రముఖులు… ఇలా అంతా కూడా రాజమౌళిని తమదైన శైలిలో అభినందిస్తున్నారు.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన స్పందన తెలియజేశారు. దర్శకుడు సుకుమార్ అయితే రాజమౌళిని ఆకాశానికెత్తేశారు. “మీరు పక్కనే ఉన్న మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి .. మేము ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి. ఇలాంటి సినిమాలు మీరు తీయగలరు .. మేము చూడగలం అంతే” అంటూ సుకుమార్ తన మనసులోని మాటను చెప్పారు. ఇక తాజాగా తమిళ దర్శకుడు శంకర్ స్పందిస్తూ .. “రాజుగారూ మీ ఊహా శక్తి అతీతమైనది .. మీకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. ఎన్టీఆర్ – చరణ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు” అంటూ రాసుకొచ్చారు డైరెక్టర్ శంకర్.

  Last Updated: 26 Mar 2022, 02:14 PM IST