సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) డైరెక్షన్ లో రాం చరణ్ (Ram Charan ) హీరోగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. శంకర్ సినిమా అంటే రిలీజ్ ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే రిలీజ్ అవుతుంది. గేమ్ చేంజర్ విషయంలో కూడా అంతే. క్వాలిటీ విషయంలో అసలేమాత్రం రాజీ పడని శంకర్ సినిమా తను అనుకున్నప్పుడే రిలీజ్ చేస్తారు. అందుకే ఆయనతో సినిమా చేస్తున్న నిర్మాతలు సినిమా రిలీజ్ ఎప్పుడు అంటే అది డైరెక్టర్ శంకర్ ని అడగండి అంటారు.
ఇక లేటెస్ట్ గా భారతీయుడ్ 2 సినిమా ఈవెంట్ లో గేమ్ ఛేంజర్ (Game Changer) గురించి ప్రస్తావించారు శంకర్. సినిమా రాం చరణ్ పోర్షన్ పూర్తైంది ఐతే త్వరలో సినిమా పూర్తి చేశాక రిలీజ్ డేట్ చెబుతామని అన్నాడు. మెగా ఫ్యాన్స్ (Mega Fans) గేం ఛేంజర్ రిలీజ్ కోసం ఎంత ఎగ్జైటింగ్ తో ఎదురుచూస్తుండగా ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లుతూ ఇంకా షూటింగ్ ఉందంటూ చెప్పారు శంకర్.
చరణ్ గేమ్ చేంజర్ అసలైతే దసరా రేసులో ఉంటుందని అనుకోగా అది కష్టమే అని తెలుస్తుంది. ఇప్పుడు శంకర్ కామెంట్స్ చూస్తుంటే దీపావళికి అయినా వస్తుందా రాదా అన్న డౌట్ రేంజ్ అవుతుంది. శంకర్ మాత్రం సినిమాను తను అనుకున్నట్టుగా వచ్చాకే రిలీజ్ డేట్ అంటున్నాడు. ఇక నిర్మాత దిల్ రాజు ఐతే గేమ్ ఛేంజర్ పై బాధ్యత అంతా శంకర్ మీదే పెట్టాడని తెలుస్తుంది.
ఆచార్య తర్వాత శంకర్ డైరెషన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న రాం చరణ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. RRR తో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న చరణ్ తన నెక్స్ట్ సినిమా బుచ్చి బాబు డైరెక్షన్ లో లాక్ చేసుకున్నారని తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ తో జాన్వి జత కడుతుంది.
