Shankar : శంకర్ సినిమాటిక్ యూనివర్స్.. వాళ్లు చెడగొట్టేశారు లేదంటే..!

Shankar ఈమధ్య డైరెక్టర్స్ అంతా కూడా సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒక సరికొత్త ట్రెండ్ కొనసాగిస్తున్నారు. మార్వెల్, డీసీ సీరీస్ లను ఫాలో అవుతూ ఒక సినిమాలోని పాత్రను

Published By: HashtagU Telugu Desk
Shankar Comments on Ram Charan Game Changer Relese

Shankar Comments on Ram Charan Game Changer Relese

Shankar ఈమధ్య డైరెక్టర్స్ అంతా కూడా సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒక సరికొత్త ట్రెండ్ కొనసాగిస్తున్నారు. మార్వెల్, డీసీ సీరీస్ లను ఫాలో అవుతూ ఒక సినిమాలోని పాత్రను మరో సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తూ కథలు రిలేట్ చేస్తూ సినిమాటిక్ యూనివర్స్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ తీసిన ఖైదీ, విక్రం ఇలాంటి కోవలోనే వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన హనుమాన్, కల్కి ఇలా అన్ని సినిమాటిక్ యూనివర్స్ గా వస్తున్నాయి.

ఐతే ఇప్పుడు కాదు ఎప్పుడో 2008 లోనే ఇలా ఒక సినిమాటిక్ యూనివర్స్ గా సినిమా చేయాలని అనుకున్నారట శంకర్. సౌత్ లో టాప్ ప్లేస్ లో ఉంటూ తన సత్తా చాటిన శంకర్ రోబో సినిమా తీసే టైం లోనే అంతకుముందు చేసిన ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజి ఈ పాత్రలతో కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందని అనుకున్నాడట. ఇదే విషయాన్ని తన అసిస్టెంట్ లతో చెబితే వారు నవ్వేశారట.

అంతేకాదు తన ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్పినా వారు కూడా అంతగ ఎంకరేజ్ చేయలేదట. ఒకవేళ శంకర్ కి ఆ టైం లో ఎవరైనా సపోర్ట్ చేసి ఉంటే అప్పట్లోనే శంకర్ సినిమాటిక్ యూనివర్స్ వచ్చేది. శంకర్ నుంచి మొదలవ్వాల్సిన ఈ సినిమాటిక్ యూనివర్స్ మన దగ్గా లోకేష్ స్టార్ట్ చేశాడు. సరే అప్పుడు కుదరలేదు మరి ఇప్పుడు అలాంటిది ఏదైనా శంకర్ ట్రై చేస్తారా అన్నది చూడాలి.

Also Read : Kalki 2898AD : కల్కి 500 కోట్లు కౌంటింగ్.. ఇది ప్రభాస్ మాస్ విజృంభన..!

  Last Updated: 01 Jul 2024, 07:11 AM IST