శంబాలా కు ఓటీటీలో భారీ ఆదరణ.. 11 రోజుల్లోనే సరికొత్త రికార్డు!

Shambala Movie  యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ చిత్రం ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించింది. థియేటర్లలో విజయం సాధించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ అద్భుతమైన ఆదరణ దక్కించుకుంటోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం, కేవలం 11 రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసుకుని సత్తా చాటింది. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ‘శంబాల’ గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. అక్కడ మంచి […]

Published By: HashtagU Telugu Desk
Shambhala Movie

Shambhala Movie

Shambala Movie  యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ చిత్రం ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించింది. థియేటర్లలో విజయం సాధించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ అద్భుతమైన ఆదరణ దక్కించుకుంటోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం, కేవలం 11 రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసుకుని సత్తా చాటింది.

యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ‘శంబాల’ గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. అక్కడ మంచి స్పందన అందుకున్న తర్వాత, గత నెల 21న ‘ఆహా’లో అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో విడుదలైన నాటి నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ క్రమంలోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాల మైలురాయిని చేరుకోవడంతో ‘ఆహా’ సంస్థ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఈ విజయంతో ‘శంబాల’ థియేటర్లతో పాటు ఓటీటీలోనూ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం తెలుగులో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సినిమాను త్వరలో హిందీలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కావొచ్చని ప్రచారం సాగుతున్నా, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

  Last Updated: 02 Feb 2026, 01:03 PM IST