Shakeela – Bigg Boss : ‘బిగ్ బాస్’ షోలో ఇవాళ (ఆదివారం) 15వ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఒక ముఖ్యమైన లీక్ బయటికి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుంచి షకీలా బయటకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో తక్కువ ఓట్లు రావచ్చని అందరూ అంచనా వేస్తున్న ప్రిన్స్ యావర్ సేవ్ అయినట్టేనని అంటున్నారు. ఈసారి బిగ్ బాస్ నుంచి రాబోయే టాస్క్ లలో పవర్ అస్త్రను సంధించకపోతే ప్రిన్స్ యావర్ మరోసారి నామినేషన్స్ ఒత్తిడిని ఫేస్ చేయాల్సి రావచ్చు. ఈ వారంలో ఇప్పటివరకు అనుదీప్, ప్రశాంత్, షకీలా, టేస్టీ తేజ, గౌతమ్, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, రతికలు నామినేషన్స్‌లో ఉన్నారు. వారిలో అమర్ దీప్ కొంచెంలో సేవ్ అయ్యాడు.
Also read : Hyundai Elantra N: గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయిన హ్యుందాయ్ ఎలంట్రా ఎన్.. ఫీచర్లు ఇవే..?
15వ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ప్రకారం.. నాగ్ హౌస్ మేట్స్‌లో ‘బాహుబలి’ టాస్క్ ఇచ్చారు. హౌస్‌లో బాహుబలి ఎవరు? భల్లాల దేవ ఎవరో చెప్పాలని కంటెస్టెంట్లను అడిగారు. తొలుత టేస్టీ తేజ బదులిస్తూ .. శివాజీని భల్లాలదేవ అని, గౌతమ్ ను కట్టప్ప అని చెప్పారు. ఆ తర్వాత దామినీ రియాక్ట్ అవుతూ.. హౌస్‌లో చాలామంది కట్టప్పలు ఉన్నారని చెప్పింది. ఇక ప్రియాంక ఆన్సర్ చెబుతూ.. శివాజీని కట్టప్పగా, సందీప్‌ను భల్లాలదేవుడిగా పోల్చింది. షకీలా జవాబు చెబుతూ.. పల్లవి ప్రశాంత్‌ను భల్లాలదేవుడిగా, ప్రిన్స్‌ను కట్టప్పగా పోల్చారు. చివరిగా హౌస్ నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ పేరును నాగార్జున (Shakeela – Bigg Boss) ప్రకటించారు. ఆ పేరు ఏది అనేది ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది. కాగా, ఈ వారం అర్జున్ అంబటి, నటి సురేఖా వాణి కూతురు సుప్రిత బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.