Shahrukh Khan : మొన్న వైష్ణోదేవి.. ఇవాళ షిర్డీ సాయిబాబా.. ఆలయాలకు క్యూ కడుతున్న షారుఖ్..

తాజాగా నిన్న షిర్డీ సాయిబాబా(Shirdi Sai Baba) ఆలయాన్ని సందర్శించారు షారుఖ్.

  • Written By:
  • Publish Date - December 15, 2023 / 07:25 AM IST

బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shahrukh Khan) స్వతహాగా ముస్లిం అయినా హిందూ ఆలయాలను కూడా సందర్శిస్తూ పూజలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా తన సినిమాల రిలీజ్ ల ముందు, ఏవైనా పండగల సమయంలో ఆలయాలకు వస్తుంటాడు. త్వరలో షారుఖ్ ‘డంకీ'(Dunki) సినిమా రిలీజ్ ఉండటంతో షారుఖ్ ఖాన్ ఆలయాలను సందర్శిస్తున్నారు. డంకీ సినిమా డిసెంబర్ 21న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.

ఈ సంవత్సరం పఠాన్, జవాన్ సినిమాలతో రాగా ఆ రెండు సినిమాల రిలీజ్ కి ముందు కూడా షారుఖ్ జమ్మూలో ఉన్న వైష్ణోదేవి మాత ఆలయాన్ని సందర్శించారు. ఇటీవల ఇప్పుడు డంకీ రిలీజ్ ముందు కూడా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. జవాన్ ముందు తిరుమల వేంకటేశ్వరస్వామిని కూడా దర్శించుకున్నారు.

తాజాగా నిన్న షిర్డీ సాయిబాబా(Shirdi Sai Baba) ఆలయాన్ని సందర్శించారు షారుఖ్. తన కూతురు సుహానా ఖాన్, మేనేజర్ పూజ, తన స్టాఫ్ తో కలిసి షారుఖ్ షిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించారు. ఈ నేపథ్యంలో అభిమానులు షిర్డీ ఆలయానికి భారీగా తరలి వచ్చారు. షారుఖ్ వారికి అభివాదం చేస్తూ లోపలి వెళ్లారు. సాయిబాబా వద్ద పూజలు చేసిన అనంతరం తిరిగి వెళ్లిపోయారు షారుఖ్. దీంతో షారుఖ్ ఖాన్ షిర్డీ సాయి బాబా ఆలయాన్ని సందర్శించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Also Read : Deepika Padukone : తిరుమలకు కాలినడకన బాలీవుడ్ స్టార్ హీరోయిన్..