Srikanth : షారుఖ్ ఖాన్ మూవీ రీమేక్.. శ్రీకాంత్ హీరోగా అనౌన్స్ చేసి.. తర్వాత హీరోని మార్చేసి..

సూపర్ హిట్ మూవీకి రీమేక్, స్టార్ క్యాస్ట్ దీంతో హీరోగా తన కెరీర్ ఒక గాడిలో పడుతుందని శ్రీకాంత్ అనుకున్నాడు. మరో నాలుగు రోజుల్లో మూవీ షూటింగ్‌ మొదలవుతుంది అనుకున్న సమయంలో దర్శకుడు షిండే ప్లేస్ లో తమ్మారెడ్డి భరద్వాజ వచ్చి చేరాడు.

  • Written By:
  • Publish Date - July 26, 2023 / 08:30 PM IST

టాలీవుడ్(Tollywood) హీరో శ్రీకాంత్(Srikanth).. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించాడు. 1993లో ‘వన్ బై టు’ అనే సినిమాలో హీరోగా మొదటిసారి నటించాడు. కానీ ఆ సినిమా అంతగా గుర్తింపు తీసుకు రాలేదు. ఇంతలో శ్రీకాంత్ కి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా 1993లో తెరకెక్కిన ‘బాజీఘర్‌’ మూవీ సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఆ మూవీ తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ‘చరిత చిత్ర నిర్మాణ సంస్థ’ సొంతం చేసుకుంది.

షిండే దర్శకత్వంలో ‘వేటగాడు’ పేరుతో ఈ సినిమాని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేశారు. హీరోగా శ్రీకాంత్, హీరోయిన్లుగా సౌందర్య(Soundarya), రంభ(Rambha)ని సెలెక్ట్ చేశారు. సూపర్ హిట్ మూవీకి రీమేక్, స్టార్ క్యాస్ట్ దీంతో హీరోగా తన కెరీర్ ఒక గాడిలో పడుతుందని శ్రీకాంత్ అనుకున్నాడు. మరో నాలుగు రోజుల్లో మూవీ షూటింగ్‌ మొదలవుతుంది అనుకున్న సమయంలో దర్శకుడు షిండే ప్లేస్ లో తమ్మారెడ్డి భరద్వాజ వచ్చి చేరాడు. ఇక శ్రీకాంత్ స్థానంలోకి రాజశేఖర్‌ను(Rajasekhar) తీసుకు వచ్చారు. ఈ మార్పులకు కారణమేంటో అనేది మాత్రం తెలియదు. అయితే తమ్మారెడ్డి, రాజశేఖర్ చాలా క్లోజ్ అని అందరికి తెలిసిందే. దీంతో తమ్మారెడ్డి చేతిలోకి దర్శకత్వం రాగానే శ్రీకాంత్ ని తప్పించి రాజశేఖర్ ని పెట్టుకున్నట్టు సమాచారం.

అంతేకాదు హీరోగా చేయాల్సిన ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర చేయాల్సి వచ్చింది. కెరీర్‌ తొలినాళ్లలో అలా ఒక మంచి అవకాశం చేజారిపోయినందుకు తాను ఎంతో బాధపడినట్లు శ్రీకాంత్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ మూవీ చేజారిపోయిన అదే ఏడాది ‘తాజ్‌మహల్‌’ వంటి లవ్ స్టోరీతో సూపర్ హిట్టు అందుకొని హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా నటుడిగా శ్రీకాంత్ కి 25వ మూవీ కావడం విశేషం. ఈ మూవీ తరువాత ‘పెళ్లి సందడి’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ కూడా సొంతం చేసుకోవడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది.