Shahrukh Khan: బాలీవుడ్ కోసం ఆ పని చేస్తున్న షారుఖ్.. ఇండస్ట్రీని నిలబెట్టగలడా?

ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీ నుంచి సినిమాలు విడుదల అవుతూ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - June 30, 2022 / 10:00 PM IST

ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీ నుంచి సినిమాలు విడుదల అవుతూ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.సౌత్ సినిమాలకు పోటీగా బాలీవుడ్ హీరోలు నటించిన భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైన ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలో పడ్డాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో మంచి హిట్ కొట్టడానికి సౌత్ ఇండస్ట్రీ బాట పట్టినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ ఎలాగైనా హిట్ కొట్టాలని తాపత్రయపడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇతర బాలీవుడ్ సినిమాల మాదిరి కాకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందా లేదంటే ఈ సినిమా కూడా చేదు అనుభవాన్ని మిగిల్సుతోందా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఇకపోతే అట్లీ దర్శకత్వంలో ఇప్పటివరకు తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఈయన దర్శకత్వంలో రాబోతున్న జవాన్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక షారూఖ్ ఖాన్ వెండితెరపై సుమారు నాలుగు సంవత్సరాల నుంచి ప్రేక్షకులను సందడి చేయలేకపోతున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా వెండితెరకు దూరమైన షారుక్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో దొరికేకుతున్న జవాన్ సినిమా ద్వారా రాబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా ముంబైలో షూటింగ్ పనులను ప్రారంభించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.