Shahid Kapoor: అప్పుడు సహించాను.. కానీ ఇప్పుడు ఊరుకోను.. షాహిద్ కపూర్ కామెంట్స్ వైరల్?

  • Written By:
  • Publish Date - March 1, 2024 / 12:47 PM IST

తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ లేని ఒక వ్యక్తిగా ఎంట్రీ ఇచ్చినట్లు ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు షాహిద్ కపూర్. అతడి తండ్రి సీరియల్స్ లో నటించాడు. అలాగే తల్లి బుల్లితెరపై ప్రముఖ రచయిత,నటి కూడా. కానీ తన తల్లి తండ్రుల పేర్లు ఏమాత్రం వాడుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కబీర్ సింగ్, జెర్సీ, బ్లడీ డాడీ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. అయితే కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీలో తనను బయటివ్యక్తిలాగే చూశారని, ఆ సమయంలో ఎన్నో అవమానాలను, వేధింపులను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు.

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బాగానే పాపులారిటీ సంపాదించుకున్నారు షాహిద్ కపూర్. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షాహిద్ కపూర్ సంచలన వాఖ్యలు చేసారు. ఈ సందర్బంగా షాహిద్ కపూర్ మాట్లాడితూ.. నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ఇది నేను ఒక పాఠశాల లాంటిదని భావించాను. ఇక్కడ నా తల్లితండ్రులు నటీనటులు అయినా ఎలాంటి ప్రయోజనం పొందలేదు. ఇక్కడ స్టార్స్, సూపర్ స్టార్స్, డైరెక్టర్స్ కు మాత్రమే అలాంటి శక్తి ఉంటుంది. మాములు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కాదు. ఇక్కడ బయటి వ్యక్తులకు అంతగా అవకాశాలు ఇవ్వరు. ఇక్కడ బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. ఒకరికి ఒకరు సహకరించాలి. కానీ వారు అలా ఉండరు.

దీంతో ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోన్నాను. ఎన్నో సవాళ్లను, అవమానాలను దాటుకుని నా ప్రతిభతో, ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. మేము ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చినప్పుడు స్కూల్లో అందరు నా యాస కారణంగా దూరం పెట్టేవారు. అక్కడ ఎన్నో వేధింపులు వచ్చాయి. ఇలాగే కొన్నేళ్లకు సినీ పరిశమ్రలోకి వచ్చిన తర్వాత వేధింపులకు గురయ్యాను. ఇక్కడ బయటి వ్యక్తులను సులభంగా అంగీకరించరు అని తెలుసుకున్నాను. అవకాశాల కోసం ఇతరులతో కలిసి తిరిగేరకాన్ని కాదు. ఇతరులను ఎదగకుండా చేయడం, అవమానించడం సరికాదు. టీనేజ్ లో తిరిగి పోరాడేంత శక్తి నాకు లేకపోయింది. కానీ ఇప్పుడు నన్ను వేధించాలని చూస్తే మాత్రం అసలు ఊరుకోను. తిరగబడతాను. ఇతరులను వేధించి ఆనందించేవాళ్లను నేను కూడా వేధిస్తాను. దానికి వారు అర్హులు అని చెప్పుకొచ్చారు షాహిద్ కపూర్.. ఈ సందర్బంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.