Shahid Kapoor : హిట్ కోసం సౌత్ డైరెక్టర్స్ వైపు బాలీవుడ్ హీరోలు.. వంశీ పైడిపల్లితో షాహిద్..

హిట్ కోసం సౌత్ డైరెక్టర్స్ వైపు బాలీవుడ్ హీరోలు. మొన్న షారుఖ్, రణ్‌బీర్. ఇప్పుడు సల్మాన్, షాహిద్.

Published By: HashtagU Telugu Desk
Shahid Kapoor Salman Khan Movies With South Directors Ar Murugadoss Vamshi Paidipally

Shahid Kapoor Salman Khan Movies With South Directors Ar Murugadoss Vamshi Paidipally

Shahid Kapoor : ప్రస్తుతం బి-టౌన్ హీరోలకు ఒక సాలిడ్ హిట్ అందించేందుకు.. బాలీవుడ్ లో సరైన దర్శకుడు కనిపించడం లేదు. దీంతో నార్త్ హీరోలంతా సౌత్ డైరెక్టర్స్ వైపు చూపు తిప్పుతున్నారు. ఈక్రమంలోనే తమిళ్ దర్శకుడు అట్లీతో షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమా చేసి వెయ్యి కోట్లు క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత రణ్‌బీర్ కపూర్ తెలుగు దర్శకుడు సందీప్ వంగతో ‘యానిమల్’ సినిమా చేసి 800 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నారు.

ఇక ఈ హిట్స్ చూసిన మిగితా బి-టౌన్ హీరోలకు సౌత్ డైరెక్టర్స్ పై పూర్తి నమ్మకం కలిగింది. దీంతో ఒక్కొక్కరిగా సౌత్ డైరెక్టర్స్ వెనకాల పడుతూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమిళ్ దర్శకుడు మురగదాస్ తో తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేసారు. ఇక తాజాగా మరో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కూడా హిట్ కోసం సౌత్ డైరెక్టర్ ని సెట్ చేశారట. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో షాహిద్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నారట.

తెలుగులో మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు సూపర్ హిట్స్ ఇచ్చిన వంశీ పైడిపల్లి.. గత ఏడాది తమిళ్ వెళ్లి అక్కడ స్టార్ హీరో విజయ్ కి కూడా బ్లాక్ బస్టర్ ని అందించారు. ఇక తెలుగు, తమిళ్ అయిపోవడంతో.. ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారట. వంశీ పైడిపల్లిని తమిళ్ కి తీసుకువెళ్లిన నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్ట్ కి కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నారట. త్వరలోనే ఈ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. మరి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తారా..? లేదా కేవలం హిందీలోనే చిత్రీకరిస్తారా..? అనేది చూడాలి.

Also read : Thammudu : ప్లాప్‌ల్లో ఉన్న నితిన్ సినిమాలోని.. ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం అన్ని కోట్లా..

  Last Updated: 24 Apr 2024, 06:45 PM IST