Site icon HashtagU Telugu

Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు స్టేజ్ పైనే ముద్దుపెట్టిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్?

Mixcollage 20 Mar 2024 08 49 Am 8290

Mixcollage 20 Mar 2024 08 49 Am 8290

2017లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ,షాలిని పాండే కలిసిన నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడంతో పాటు ఈ సినిమాతో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయారు. ఈ సినిమా టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ తీసుకువచ్చింది. అర్జున్ రెడ్డి భారీ విజయం సాధించడంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగ తన దర్శకత్వంలోనే కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి తెరకెక్కించాడు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిన కబీర్ సింగ్ 2019 లో రిలీజయి బాలీవుడ్ లో భారీ హిట్ కొట్టి ఏకంగా 250 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.

సందీప్ వంగ ఈ రెండు సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిపోయి బాలీవుడ్ లో భారీ ఆఫర్స్ దక్కించుకున్నాడు. ఈ రెండు సినిమాలతోనే షాహిద్ కపూర్, అర్జున్ రెడ్డి కూడా స్టార్స్ అయ్యారు. తాజాగా ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించారు. తాజాగా మర్చి 19 సాయంత్రం ముంబైలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాల గురించి ఒక ఈవెంట్ నిర్వహించగా అన్ని సినీ పరిశ్రమల నుంచి పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో కబీర్ సింగ్ చేసిన షాహిద్ కపూర్, అర్జున్ రెడ్డి చేసిన విజయ్ దేవరకొండ ఇద్దరూ ఒకే స్టేజిపై కనిపించి అభిమానులకు ఆనందాన్ని ఇచ్చారు.

ఈ సందర్బంగా స్టేజిపై షాహిద్ కపూర్, విజయ్ దేవరకొండని పట్టుకొని మాట్లాడుతూ.. విజయ్ కి చాలా ప్రేమని ఇవ్వాలి. విజయ్ అర్జున్ రెడ్డి చేయకపోతే నా కబీర్ సింగ్ సినిమా లేదు అంటూ విజయ్ బుగ్గపై ముద్దు పెట్టాడు షాహిద్ కపూర్. దీంతో ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక విజయ్ అభిమానులు మాత్రం బాలీవుడ్ లో విజయ్ ని ఆ రేంజ్ లో పొగుడుతున్నారు అంటూ సంతోషం వ్యక్తపరుస్తున్నారు.