Site icon HashtagU Telugu

IIFA Awards 2022: తొలిసారిగా గాడిదలను గాడిదలపై చూశాం…హీరోలపై నెటిజన్ల ట్రోలింగ్..!!

Ms 1655041756553 1655041763664

Ms 1655041756553 1655041763664

హీరోలు ఎలా ఎంట్రీ ఇస్తారు..గుర్రాలపైన్నో…ఏనుగులపైన్నో ఎక్కి సందడి చేస్తుంటారు. కానీ ఓ ఇద్దరు హీరోలు మాత్రం గుర్రాలు కాకుండా గాడిదలు ఎక్కి కంట్లో పడ్డారు. ఈ ఘటన ఈ ఏడాది జరిగిన ఐఫా అవార్డు 2022 కార్యక్రమంలో జరిగింది. ఈ నెల ప్రారంభంలో అబుదాబిలోని ఐలాండ్ లో జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమం ఈనెల 25న శనివారం రాత్రి 8గంటలకు కలర్స్ టీవీలో ప్రసారం అవుతుంది. ప్రతిష్టాత్మక అవార్డు వేడుకలో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే కొన్నివినోదభరితమైన సందర్భాలు ఉన్నాయి. అయితే అందులో కొన్ని సార్ట్ మూమెంట్స్ ఖచ్చితంగా ఉన్పప్పటికీ ఈవెంట్ నుంచి ఫన్నీ క్లిప్ ను షేర్ చేశారు.

ఐఫా అధికారిక ఇన్ స్టా హ్యాండిల్లో పోస్టు చేసిన ప్రోమో వీడియోలో ఇద్దరు బాలీవుడ్ హీరోలు గాడిదలపై వస్తూ వేడుకలో సందడి చేశారు. హీరోలు షాహిద్ కపూర్, ఫర్హాన్ అక్తర్ వేదికపైకి ప్రవేశించినప్పుడు గాడిదలపై కూర్చుండి కనిపించారు. హమ్మర్లు, స్పోర్ట్స్ బైక్ లతో ఎంట్రీ ఇచ్చే హీరోలు ఇప్ుడు రెండు గాడిదలతో వస్తున్నారు అని షాహిద్ అంటాడు. అప్పుడు ఫర్హన్…గాడిదలు కూడా అలాగే ఆలోచిస్తున్నాయి…నేను పప్పు..నైస్ అని చెప్పాలి…అని అంటాడు.

అయితే ఇవన్నీ అవసరమా అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మొదటిసారిగా గాడిదలను గాడిదలపై చూశాను అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.వాళ్లకు కాళ్లు లేవా…నడవలేరా…జంతువులను ఎందుకు ఉపయోగించారంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు. మొత్తానికి సోషల్ మీడియాలో హీరోలపై ప్రశ్నల వర్షం కురుస్తోంది.