IMDB 2023: మోస్ట్ పాపులర్ ఇండియన్ యాక్టర్స్ లో షారుక్ ఖాన్ టాప్ ప్లేస్

అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల జాబితాలో షారుక్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు.

Published By: HashtagU Telugu Desk
Shahrukh Khan

Sharukh

IMDB 2023: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ 2023 IMDb టాప్ 10 అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. 2023లో బాలీవుడ్ బాద్షా జవాన్, పఠాన్ అనే రెండు ప్రధాన బ్లాక్‌బస్టర్‌లను అందించాడు. ఇవి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద హిందీ సినిమాలుగా నిలిచాయి. ఇక నటి అలియా భట్, దీపికా పదుకొణె వరుసగా 2వ, 3వ స్థానాల్లో నిలిచారు.

అలియా మాట్లాడుతూ, “నేను ఉన్న స్థితికి నన్ను తీసుకువచ్చినందుకు నా ప్రేక్షకులకు ధన్యవాదాలు. నేను వారికి వినోదాన్ని అందించాలని ఆశిస్తున్నాను. నా అభిమానులకు  కృతజ్ఞతలు. నేను కష్టపడి పనిచేస్తానని. స్ఫూర్తిదాయకమైన కథలు, పాత్రలను తెరపైకి తీసుకువస్తానని హామీ ఇస్తున్నా’’ అని అన్నారు.

నాల్గవ స్థానంలో నటి వామికా గబ్బి ఇలా అన్నారు. “IMDb మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ లిస్ట్‌లో ఇది నా అరంగేట్రం. ఇది నాకు మరింత ప్రత్యేకమైంది అంటూ రియాక్ట్ అయ్యింది.  నయనతార, తమన్నా భాటియా, కరీనా కపూర్ ఖాన్ మరియు శోభితా ధూళిపాళ వరుసగా ఐదు, ఆరు, ఏడు మరియు ఎనిమిదో స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత తొమ్మిదో స్థానంలో నిలిచిన బాలీవుడ్ ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్. అక్షయ్ తర్వాత పదో స్థానంలో స్టార్ విజయ్ సేతుపతి ఉన్నాడు.

  Last Updated: 22 Nov 2023, 12:54 PM IST