Site icon HashtagU Telugu

Shah Rukh Khan : సుకుమార్ డైరెక్షన్ లో షారుఖ్.. కానీ హీరోగా కాదు.. ఆ సినిమా కోసమా?

Shah Rukh Khan will Act in Sukumar Direction Rumors goes Viral in Bollywood

Shah Rukh Khan

Shah Rukh Khan : సుకుమార్ ఇటీవలే పుష్ప 2 సినిమాతో భారీ పాన్ ఇండియా హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. లైన్లో పుష్ప 3 సినిమా ఉన్నా దానికి చాలానే సమయం పడుతుంది. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనిలో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమా అయ్యాక సుకుమార్ సినిమా వచ్చే సంవత్సరం మొదలవుతుంది.

అయితే తాజాగా సుకుమార్ – బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కలిసి పనిచేయబోతున్నారని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం సుకుమార్ ఇప్పటికే షారుఖ్ ని కలిసాడని, కలిసి ఓ విలేజ్ పొలిటికల్ డ్రామా కథ చెప్పాడని, ఇందులో షారుఖ్ విలన్ పాత్ర అని, దానికి షారుఖ్ కూడా ఒప్పుకున్నాడని అంటున్నారు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.

అయితే సుకుమార్ షారుఖ్ ని అడిగింది రామ్ చరణ్ సినిమా కోసమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. చరణ్ – సుకుమార్ సినిమా కూడా విలేజ్ పొలిటికల్ డ్రాప్ అని గతంలో చెప్పారు. దీంతో చరణ్ సినిమాలో షారుఖ్ విలన్ గా చేయనున్నాడా అనే వార్త వైరల్ అవ్వడంతో ఇదే నిజమయితే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. చూడాలి మరి నిజంగానే షారుఖ్ సుకుమార్ సినిమాలో చేస్తాడా. ఇక సుకుమార్ చేతిలో రామ్ చరణ్ సినిమాతో పాటు పుష్ప 3 సినిమా, విజయ్ దేవరకొండ సినిమాలు ఉన్నాయి.

Also Read : Rajamouli : ఈగ, బాహుబలి, RRR మలయాళ రచయిత మరణంపై రాజమౌళి ఎమోషనల్ పోస్ట్..