Site icon HashtagU Telugu

Shah Rukh Khan: శ్రీవారి సేవలో జవాన్, కుటుంబ సమేతంగా షారుక్ ఖాన్ పూజలు

1

1

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల ఆలయంలో మంగళవారం పూజలు చేశారు. సోమవారం రాత్రి ఆలయానికి చేరుకున్న బాలీవుడ్ హీరో తెల్లవారుజామున దర్శనం చేసుకున్నారు. భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా, నటి నయనతారతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న సూపర్‌స్టార్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు స్వాగతం పలికారు. షారుక్ తో పాటు అతని కుటుంబం పూజలు చేసేందుకు తగు ఏర్పాట్లు చేశారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపానికి చేరుకున్న షారూఖ్‌ కుటుంబ సభ్యులకు అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. తన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జవాన్’ విడుదలకు ముందు తిరుమల ఆలయంలో పూజలు చేశారు. గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, దీపికా పదుకొణె, ప్రియమణి, సంజయ్ దత్ తదితరులు నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

జవాన్ మూవీ సెప్టెంబర్ 7న హిందీతోపాటు తెలుగు, తమిళంలో విడుదల కానుంది. అయితే ఓవర్సీస్‍లో సెన్సార్ చేసిన జవాన్ సినిమాను వీక్షించినట్లుగా బాలీవుడ్ కాంట్రవర్సీ క్రిటిక్ ఉమర్ సంధు తెలిపాడు. అలాగే జవాన్ మూవీకి ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. “షారుక్ ఖాన్ నటనాప్రతిమకు పర్ఫెక్ట్ న్యాయం చేసే సినిమా జవాన్. అద్భుతమైన కథకు షారుక్ ఖాన్ సూపర్బ్ ఎనర్జీ తోడై కరెక్ట్ సింక్‍లో సినిమా ఉంది. ఛాలెంజింగ్ మెయిన్ రోల్‍లో షారుక్ ఖాన్ అందరి మనసులను ఆకట్టుకున్నాడు” అని ఉమర్ సంధు ట్విటర్ వేదికగా తెలిపాడు.

Also Read: Hyderabad: భారీ వర్షాల ఎఫెక్ట్, హైదరాబాద్ లో అన్ని విద్యాసంస్థలకు సెలవ్!

Exit mobile version