Shah Rukh Khan: గ్లోబల్ స్టార్ బాలీవుడ్ కింగ్ ఖాన్.. TIME100 జాబితాలో షారుక్ టాప్ ప్లేస్!

ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను వెనక్కి నెట్టి Shah Rukh Khan టాప్ ప్లేస్ లో నిలిచారు.

Published By: HashtagU Telugu Desk
Shahrukh Khan

Sharukh

టైమ్ మ్యాగజైన్ వార్షిక TIME100 జాబితాలో సూపర్ స్టార్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan) అగ్రస్థానంలో నిలిచారు. పోల్‌లో TIME అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులకు మ్యాగజైన్ రీడర్స్ అర్హులైనవారికి ఓటేస్తారు. అమెరికన్ పబ్లికేషన్ ప్రకారం.. ఈ పోల్‌లో 1.2 మిలియన్లకు పైగా ఓట్లు పడ్డాయి. 57 ఏళ్ల ఈ బాలీవుడ్ నటుడు (Shah Rukh Khan) “పఠాన్” విజయంతో ఒక్కసారిగా దూసుకొచ్చాడు. నాలుగు సంవత్సరాలకు పైగా నటనకు దూరంగా ఉన్న ఈ బాలీవుడ్ స్టార్ పఠాన్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసి తానేంటో చాటిచెప్పాడు.

దేశంలోని ఇస్లామిక్ పాలన నుండి స్వేచ్ఛ కోసం నిరసన తెలిపిన ఇరాన్ మహిళలకు రెండవ స్థానం లభించింది. సెప్టెంబరు 16న 22 ఏళ్ల మహ్సా అమినీ మరణించినప్పటి నుంచి ఇరాన్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల కారణంగా ఆమె పోలీసు స్టేషన్‌లో మరణించింది. ఇరాన్ మహిళలు TIME 2022 హీరోస్ ఆఫ్ ది ఇయర్‌లో కూడా గుర్తింపు పొందారు. గత సంవత్సరం పర్సన్ ఆఫ్ ది ఇయర్ రీడర్ పోల్‌లో కూడా గెలుపొందారు.

Rj 1.9 శాతం ఓట్లతో బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్క్లే పోల్‌లో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. గత ఏడాది ఖతార్‌లో ఫ్రాన్స్‌తో జరిగిన ఎపిక్ ఫైనల్‌లో అర్జెంటీనాను ప్రపంచకప్ కీర్తికి చేర్చిన మెస్సీ 1.8 శాతం ఓట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక ఆస్కార్ విజేత మిచెల్ యోహ్, మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్, బ్రెజిలియన్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా వంటి ఇతర తారలు, ప్రముఖ వ్యక్తులు పోల్‌లో ఉన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను వెనక్కి నెట్టి షారుక్ ఖాన్ (Shah Rukh Khan) టాప్ ప్లేస్ (Top Place) లో నిలవడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Khushbu Sundar: ఖుష్బూ కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు!

  Last Updated: 07 Apr 2023, 04:23 PM IST