Shah Rukh Khan : తాను స్మోకింగ్ పూర్తిగా మానేశానని ఇటీవలే హీరో షారుక్ ఖాన్ ప్రకటించారు. అయితే ఈ అంశంపై ఆయన అభిమానుల నుంచి మంచి రియాక్షన్స్ వస్తున్నాయి. చాలామంది షారుక్ అభిమానులు.. ఇక తాము కూడా స్మోకింగ్ మానేస్తామని ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో మరోసారి షారుక్ (Shah Rukh Khan) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఏకధాటిగా 30 ఏళ్లపాటు స్మోకింగ్ చేశాను. ఎట్టకేలకు ఇప్పుడు ఆ అలవాటును మానేశాను. నాకు నేనైతే పెద్ద రోల్ మోడల్‌గా భావించడం లేదు’’ అని షారుక్ స్పష్టం చేశారు. ‘‘యువతకు నేను చెప్పేది ఒక్కటే.. మీకు జీవితంలో ఏది మంచిగా అనిపిస్తే అదే చేయండి.. నేను మీకు పెద్ద రోల్ మోడల్‌ను కాదు’’ అని ఆయన తేల్చి చెప్పారు.
Also Read :US Elections 2024 : అమెరికా ఎన్నికలు.. మన భారతీయ భాషలోనూ బ్యాలెట్ పేపర్లు
దిగువ మధ్యతరగతి నుంచి వచ్చాను
‘‘నేను ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నా తల్లిదండ్రులు నన్ను బాగానే చదివించారు. ఆనాటి చదువు నాకు జీవితంలో బాగానే ఉపయోగపడింది. మీ కెరీర్ జర్నీ ఎక్కడ మొదలైంది అనే అంశానికి అంతగా ప్రాధాన్యం ఉండదు. మీరు కష్టపడి చదవండి. అన్ని మంచి విషయాలు నేర్చుకోండి. మీ కలను సాకారం చేసుకునేందుకు అలుపెరగకుండా ప్రయత్నించండి. తప్పకుండా మీకు మంచి ఫలితం ఒకరోజు వస్తుంది’’ అని యువతకు షారుక్ సందేశమిచ్చారు. మొత్తం మీద నవంబరు 2న తన 59వ పుట్టినరోజు సందర్భంగా ముంబైలో షారుక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
2011లో షారుక్ ఏం చెప్పారంటే..
2011లో ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుక్ తన స్మోకింగ్ అలవాటు గురించి వివరించారు. “నేను రోజూ దాదాపు 100 సిగరెట్లు తాగుతాను. రోజూ అన్నం తినడం మర్చిపోతాను. నీళ్లు కూడా ఎక్కువగా తాగను. నా దగ్గర దాదాపు 30 కప్పుల బ్లాక్ కాఫీ ఉంది. నా దగ్గర సిక్స్ ప్యాక్ ఉంది’’ అని తెలిపారు. తాజాగా తన బర్త్ డే పార్టీ సందర్భంగా స్మోకింగ్‌ను మానేశానని షారుక్ వెల్లడించారు.