రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమారుడు అనంత్ అంబానీ వివాహం జరగనుంది. అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త కూతురు రాధిక మర్చంట్ ను వివాహం చేసుకోనున్నారు. వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు త్వరలో జరగనున్నాయి. అంబానీ ఇంట పార్టీ అంటే బాలీవుడ్ సెలబ్రిటీలు తప్పకుండా హాజరవుతారు. ఇక అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వెళ్లేందుకు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఇటీవల గుజరాత్‌లోని జామ్‌నగర్‌ను సందర్శించారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సిద్ధమయ్యేందుకు షారుఖ్ ఖాన్ ఇటీవల గుజరాత్‌లోని జామ్‌నగర్‌ను సందర్శించారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ అనంత్ అంబానీ వివాహ వేడుకలో పాల్గొననున్నారు. అందుకే షారుక్ రిహార్సల్స్ కోసం జామ్‌నగర్‌ను సందర్శించాడు.ఫిబ్రవరి 22, గురువారం ముంబైకి బయలుదేరే ముందు అతను జామ్‌నగర్‌లో ఒక రోజు ఉన్నట్లు తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ ముంబైకి వెళ్లడానికి జామ్‌నగర్ విమానాశ్రయంలోకి వెళ్లే ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. ఈ వీడియోలో షారుక్ నల్ల జాకెట్ ధరించాడు. ఎప్పటిలాగే స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. దీంతో షారుక్‌కు సంబంధించిన ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈవో వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
#ShahRukhKhan is all set to return to Mumbai after rehearsing for #AnantAmbani #RadhikaMerchant pre-wedding festivities in Jamnagar. pic.twitter.com/6Ib5VDA9Wv
— News18 Showsha (@News18Showsha) February 22, 2024
వారి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మార్చి 1, 2024న ప్రారంభంకానున్నాయి. మార్చి ప్రారంభంలో జామ్‌నగర్‌లో జరిగే ప్రీ వెడ్డింగ్ వేడుకలకు చాలా మంది అంతర్జాతీయ అతిథులు హాజరు కానున్నారు. ఈ జాబితాలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈవో టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డిస్నీ సీఈవో బాబ్ ఇగర్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, అడ్నాక్ సీఈవో సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్, ఈఎల్ రోత్‌స్‌చైల్డ్ చైర్మన్ లిన్ ఫారెస్టర్ డి రోత్‌స్‌చైల్డ్ ఈ పెద్ద పెద్ద బిజినెస్ మాన్లు ఉన్నారు. న్