Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ ప్రాణాలకు ముప్పు..

షారుక్ ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం..అలాగే ముంబైలో ఆయన నివాసం ఉంటోన్న మన్నత్ రెసిడెన్స్‌కూ తరచూ డెత్ నోట్స్ రావడం మొదలుపెట్టాయి

Published By: HashtagU Telugu Desk
Shah Rukh Khan Gets Y+ Security Cover After Death Threats

Shah Rukh Khan Gets Y+ Security Cover After Death Threats

జవాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan ) ప్రాణాలకు ముప్పు ఉందా..? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. రీసెంట్ గా షారుఖ్ జవాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఈ మూవీ హిట్ తర్వాత షారుఖ్ కు బెదిరింపు కాల్స్ ఎక్కువయయ్యట.

షారుక్ ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ ( Death Threats) రావడం..అలాగే ముంబైలో ఆయన నివాసం ఉంటోన్న మన్నత్ రెసిడెన్స్‌కూ తరచూ డెత్ నోట్స్ రావడం మొదలుపెట్టాయి. దీనిపై షారుఖ్ ఖాన్ ఇప్పటికే ముంబై పోలీసులకు (Mumbai Police) ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంది. షారుఖ్ ఖాన్‌కు కల్పించిన భద్రతను మరింత పెంచింది. వై ప్లస్‌ (Y +) గా మార్చింది. ఈ మేరకు మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Y ప్లస్ సెక్యూరిటీ ( Y+ Security Cover) కింద షారుక్ కు 11 మందితో భద్రతను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వీరిలో ఆరుగురు కమెండోలు కాగా, మిగిలిన నలుగురు రాష్ట్ర వీఐపీ సెక్యూరిటీ వింగ్ కు చెందినవారు. ఈ సిబ్బంది వద్ద ఎంపీ-5 మెషీన్ గన్స్, ఏకే 47 అస్సాల్ట్ రైఫిల్స్, గ్లోక్ పిస్టళ్లను కలిగి ఉంటారు. దీంతోపాటు… షారుక్ నివాసం చుట్టూ 24 గంటలూ పోలీసులు పహారాలో ఉంటారు. ఇక పఠాన్ సినిమా సమయంలో కూడా షారుక్ కు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను సెక్యూరిటీగా ఏర్పాటు చేసింది. దీనికి తోడు షారుక్ కు తన సొంత బాడీగార్డ్స్ కూడా ఉన్నారు.

  Last Updated: 09 Oct 2023, 01:42 PM IST