Site icon HashtagU Telugu

Shah Rukh Khan: షాంపూ వాడని షారుక్ ఖాన్.. ఎందుకో తెలుసా!

Shahrukh Khan

Sharukh

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా పఠాన్ రూపంలో బాలీవుడ్ కు భారీ హిట్ ను అందించి మళ్లీ రేసులోకి వచ్చాడు. అయితే వయసు మీద పడుతున్నా ఈ హీరో మాత్రం లుక్, బాడీని కాపాడుకుంటూ యంగ్ హీరోలా కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు షారుక్ సమాధానమిచ్చాడు. మీరు జుట్టు రక్షణకు ఏం వాడుతారని ఓ అభిమాని అడగ్గా, తలస్నానం రెగ్యులర్ గా చేయనని, అసలు నా జుట్టుకు షాంపూ వాడను” అని షారుక్ బదులిచ్చారు.

మరో అభిమాని ‘పఠాన్’ దేనికి భయపడుతున్నాడని అడిగాడు, దానికి అతను ‘పఠాన్’ “తన దేశానికి తన సామర్థ్యం, ​​సామర్థ్యాలు మరియు అంతకు మించి సేవ చేయలేనందుకు భయపడుతున్నాడని షారుక్ చెప్పాడు. అయితే షారుక్ షాంపూ రెగ్యులర్ గా వాడకపోవడం పట్ల ఏదో సీక్రెట్ ఉండి ఉంటుందని అభిమానులు అంటున్నారు.

జుట్టు రక్షణ కు కోసమే షారుక్ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటాడని, కెమికల్స్ లాంటి వాటికి దూరంగా ఉండేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఉంటారని భావిస్తున్నారు. అయితే చాలామంది స్టార్స్ సహజంగా దొరికే క్రీమ్స్, లోషన్స్ కు మాత్రమే వాడేందుకు ఆసక్తి చూపుతుంటారు. శీకాయ, కుంకుడు కాయలతో తలస్నానం చేస్తూ తమ జుట్టును కాపాడుకుంటుంటారు.